HYD : 1న భార్యా బాధితుల సంఘ సమావేశం
ABN, First Publish Date - 2021-07-29T14:41:04+05:30
భారత భార్యాబాధితుల సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 1న సమావేశం
హైదరాబాద్ సిటీ/చిక్కడపల్లి: భారత భార్యాబాధితుల సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 1న సమావేశం నిర్వహిస్తున్నట్టు సంఘం జాతీయ అధ్యక్షుడు జి.బాలాజీరెడ్డి తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరుగుతుందని, ఈ సందర్భంగా కోర్ కమిటీ వేసి డివిజన్లుగా ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. భార్యాబాధితులు సమావేశానికి హాజరై అనుభవిస్తున్న బాధలు, ఆవేదనలు ప్రభుత్వానికి, పార్లమెంటుకు తెలియజేయడానికి సహకరించాలని కోరారు. ఆసక్తి ఉన్నవారు 7093434730 నెంబర్‌లో సంప్రదించాలని బాలాజిరెడ్డి కోరారు.
Updated Date - 2021-07-29T14:41:04+05:30 IST