ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్‌లోకి బీసీ నేత ఆర్‌.కృష్ణయ్య?

ABN, First Publish Date - 2021-10-29T08:42:43+05:30

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య త్వరలో టీఆర్‌ఎ్‌సలో చేరనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎ్‌సకు అనుకూలంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సోషల్‌ మీడియాలో ప్రచారం.. కొట్టిపారేసిన బీసీ నేత


హైదరాబాద్‌/ఖైరతాబాద్‌, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య త్వరలో టీఆర్‌ఎ్‌సలో చేరనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో అధికార టీఆర్‌ఎ్‌సకు అనుకూలంగా ఇటీవల ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘంతో పాటు 120 బీసీ కులాలు హుజూరాబాద్‌ ఎన్నికలో గెల్లు శ్రీనివా్‌సకే మద్దతు ఇస్తున్నట్లు తాజాగా గురువారం ఆయన మరోసారి ప్రకటించారు. వీటన్నింటి నేపథ్యంలో హుజూరాబాద్‌ ఎన్నిక తర్వాత ఆర్‌.కృష్ణయ్య కారు ఎక్కడం లాంఛనమేనని సామాజిక మాధ్యమాల్లో గురువారం జోరుగా ప్రచారం జరిగింది. అయితే, తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని ఆర్‌.కృష్ణయ్య స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీ గణన కోసం తీర్మానం చేయడం, బీసీ బంధు అమలుకు హామీ ఇచ్చిన నేపథ్యంలోనే టీఆర్‌ఎ్‌సకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. కొందరు బీసీ నాయకులు తమ పంథా మార్చుకోవాలని సూచించారు. 

Updated Date - 2021-10-29T08:42:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising