ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చీరలు.. చేరెను..

ABN, First Publish Date - 2021-10-02T04:58:01+05:30

చీరలు.. చేరెను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్‌ కలెక్టరేట్‌, అక్టోబరు 1: తెలంగాణలో అతిపెద్దదైన బతుకమ్మ పండుగకు ప్రభుత్వం ప్రతీ సంవత్సరం అందజేస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానుంది. 18ఏళ్లు నిండి, రేషన్‌ కార్డులో పేరు ఉన్న మహిళలకు మాత్రమే ప్రభుత్వం పంపిణీ చేయనుంది. జిల్లా వ్యాప్తంగా 323 గ్రామ పంచాయతీలు, వర్ధన్నపేట, నర్సంపేట మునిసిపల్‌ పరిధి, గ్రేటర్‌ వరంగల్‌ జిల్లా నగర పరిధి కలిపి మొత్తం 3,37,334 మంది లబ్ధిదారులు న్నారు. ప్రభుత్వం ఈసారి 289 రకాల రంగుల్లో, 17డిజైన్స్‌ కలిగిన చీరలను అందించ డానికి ఏర్పాట్లు చేసింది. అక్టోబరు 6 నుంచి 14వ తేదీ వరకు కొనసాగే బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఈ చీరలను  2 నుంచి ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 

మండలాల వారీగా మహిళల వివరాలు..

ఖానాపూర్‌లో 12,902, నల్లబెల్లిలో 14,742, చెన్నారావుపేటలో 15,972, దుగ్గొండిలో 17,841, పర్వతగిరిలో 18,682, సంగెంలో 18,343, వర్ధన్నపేటలో 18,875, నెక్కొండలో 20,578, రాయపర్తిలో 21,636, గీసుగొండలో 22,682, నర్సంపేటలో 28,028 మంది కాగా ఖిలా వరంగల్‌ మండలంలో  61,519, వరంగల్‌ మండలంలో 65,534 మంది మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు.

నగరంలో చీరల పంపిణీపై నేడు నిర్ణయం..?

హుజురాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో హఽనుమకొండ జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. గ్రేటర్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొ రేషన్‌ హనుమకొండ జిల్లా పరిధిలో ఉండడం, ఇందులో సగం డివి జన్లు వరంగల్‌ జిల్లాలో ఉన్న విషయం తెలిసిందే. కోడ్‌ నేపథ్యంలో అధికారులు ఈ చీరల పంపిణీపై రెండు రోజుల్లో నిర్ణయం తీసు కోనున్నట్లు సమాచారం. వరంగల్‌లో ఒకరోజు, హనుమకొండలో ఒక రోజు పంపిణీ అనేది కాకుండా గ్రేటర్‌ వరంగల్‌  మునిసిపల్‌ కా ర్పొరేషన్‌ పరిధిలో మొత్తం ఒకే రోజు పంపిణీ చేయాలనే ప్రతి పాదన పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. 

Updated Date - 2021-10-02T04:58:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising