ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలభైరవ స్వామి ఆలయంలో బాలకృష్ణ కుటుంబీకులు

ABN, First Publish Date - 2021-03-05T21:10:56+05:30

జిల్లాలోని ప్రఖ్యాత శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని సినీనటుడు బాలకృష్ణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామారెడ్డి: జిల్లాలోని ప్రఖ్యాత శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని సినీనటుడు బాలకృష్ణ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. రామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో బాలకృష్ణ  సతీమణి వసుంధర, కుమారుడు మోక్షజ్ఞ, కూతురు బ్రాహ్మణి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. సినీనటుడు బాలకృష్ణ ఏపీలోని హిందూపురం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు.


 


శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని క్రీ.శ 13వ శతాబ్దంలో ఇసన్నపల్లి గ్రామంలో నిర్మించారని గ్రామస్తులు చెబుతారు. ఆలయంలో శ్రీ కాలభైరవస్వామి మూల విగ్రహం దిగంబరంగా ఉంటుంది. కాశీక్షేత్రం తరువాత దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక కాలభైరవ స్వామి ఆలయం ఇదే. కార్తీక బహుళాష్టమి నాడు శ్రీ కాలభైరవ స్వామి జయంతిని ఇక్కడ ఘనంగా జరుపుతారు.

Updated Date - 2021-03-05T21:10:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising