ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డబ్బుల కోసం ఎవరినీ వేధించలేదు: ఆజాద్‌

ABN, First Publish Date - 2021-12-17T00:29:18+05:30

డబ్బుల కోసం తమ పార్టీ ఎవరినీ వేదించలేదని మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం, తూర్పు గోదావరి డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఆజాద్‌ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చర్ల: డబ్బుల కోసం తమ పార్టీ ఎవరినీ వేదించలేదని మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం, తూర్పు గోదావరి డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఆజాద్‌ పేర్కొన్నారు. నకిలీల వెనుక ఉన్నది పోలీసులేనని ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఆయన లేఖను విడుదల చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, తూర్పుగోదావరి జిల్లాల పోలీసులు మావోయిస్టు పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా భద్రాద్రి జిల్లా ఎస్పీ తమ పార్టీపై అసత్య ప్రచారాలు, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను, వ్యాపారులను డబ్బు కోసం వేదిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు. ఇవి వాస్తవాలైతే ప్రజలే తమను శిక్షించాలని పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీకి ఎంతో చర్రిత ఉందని, డబ్బుల కోసం వ్యాపారులను వేధించడం, హత్యలు, బెదిరింపులు చేయడం వంటి పనులు తమ పార్టీ చేయదన్నారు. మావోయిస్టు పార్టీని అబాసుపాలు చేసేందుకు పోలీసులే నకిలీలను సృష్టిస్తున్నారని ఆరోపించారు. అలాగే మావోయిస్టు పార్టీని నిర్మూలించే పనిలో సమాధాన్‌ ప్రహార్‌లో భాగంగా పార్టీపై తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను బలవంతంగా సభలు సమావేశాలకు తీసుకెళ్తున్నట్లు పోలీసులు తమ చెప్పు చేతల్లో ఉన్న ప్రసార మాద్యమాల ద్వారా బురదల జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి అబద్దపు ప్రచారాలు నమ్మొద్దని లేఖలో ఆజాద్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-17T00:29:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising