ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా పల్లివేట

ABN, First Publish Date - 2021-12-09T06:01:22+05:30

వైభవంగా పల్లివేట

అయ్యప్ప ఆలయంలో పల్లివేట పూజల్లో రాణాప్రతాప్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



శ్రీధర్మశాస్తాఅయ్యప్ప ఆలయంలో పూజలు

నర్సంపేటలో మార్మోగిన అయ్యప్ప నామస్మరణ


 నర్సంపేట, డిసెంబరు 8 : నర్సంపేటలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో బుధవారం వైభవంగా పల్లివేట కార్యక్రమం జరిగింది. కేరళలోని శబరిమలై సమీ పంలోని పుంగావనంలో జరిగిన తీరుగానే నర్సంపేట ఆల యంలో  క్షేత్రబలి, పల్లివేట కార్యక్రమాన్ని  నిర్వహించారు.  21వ మండల పూజా మహోత్సవాల్లో భాగంగా ఉత్సవ దాత టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ నాయకుడు గోగుల రాణా ప్రతాప్‌రెడ్డి,లక్ష్మీభార్గవి దంపతులు నర్సంపేటలోని ముని సిపల్‌ కార్యాలయం ఆవరణలో ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తిరుపతికి చెందిన తాంత్రిక వేత్త గురుస్వామి సీహెచ్‌..వెంకటేశ్‌శర్మవేద మంత్రోచ్ఛ రణల నడుమ ఉదయం ఆలయంలో గురుస్వాములతో కలిసి ఉత్సవబలి, క్షేత్రబలి ఘనంగా నిర్వహించారు. 

 ఆలయకమిటీ చైర్మెన్‌ శింగిరి కొండ మాధవశంకర్‌,  రాణాప్రతాప్‌రెడ్డి తల్లిదండ్రులు గోగుల ప్రతాప్‌రెడ్డి, జయశ్రీ,గురుస్వామి వెంకటేశ్‌శర్మ ప్రత్యేక పూజలు చేయించారు.  అనంతరం ఉత్సవ విగ్రహాన్ని ఆలయం నుంచి నెత్తిన ఎత్తుకుని అలంకరించిన ట్రాక్టర్‌లో ప్రతి ష్టించారు. డప్పుచప్పుళ్లు, మహిళల కోలాటాల నడుమ స్వామిశోభాయాత్ర ఊరేగింపు ఆలయం నుంచి ముని సిపల్‌ కార్యాలయం ఆవరణ వరకు నిర్వహిం చారు .అష్టో త్తర పూజలు చేసి హారతి ఇవ్వడంతో పల్లివేట ఉత్సవం ముగిసింది. అనంతరం అయ్యప్ప ఆలయంలో మాలా ధారులు, భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పూజా వేడుకలు ఎమ్మెల్యేపెది ్దసుదర్శన్‌ రెడ్డి,  మునుగాల వెంకట్‌రెడ్డి, గుంటి కిషన్‌ తిలకించి వెళ్ళారు.   



Updated Date - 2021-12-09T06:01:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising