ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆత్మకూర్ (ఎస్‌) పీఎస్‌ ఎస్సై సస్పెన్షన్

ABN, First Publish Date - 2021-11-12T21:41:15+05:30

దొంగతనం చేశారనే నెపంతో ఓ గిరిజనుడిని చితకబాదిన కేసులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: దొంగతనం చేశారనే నెపంతో ఓ గిరిజనుడిని చితకబాదిన కేసులో ఆత్మకూర్ (ఎస్‌) పీఎస్‌ ఎస్సైపై సస్పెన్షన్ వేటు పడింది. ఓ కేసు విచారణ సందర్భంగా గిరిజన యువకుడు వీరశేఖర్‌ను ఎస్సై లింగం చితకబాదాడు. దీంతో ఎస్సై క్రూరత్వంపై జిల్లా వ్యాప్తంగా ఆరోపణలు, నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో ఎస్సై లింగంను సస్పెండ్ చేస్తూ ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. 




జిల్లాలోని ఆత్మకూర్(ఎస్) పోలీస్ స్టేషన్ ముందు రామోజీ తండావాసుల ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దొంగతనం చేసాడనే  అనుమానంతో రామోజీ తండాకు చెందిన గుగులోతు వీరశేఖర్ అనే యువకుడిని బుధవారం రాత్రి పోలీస్ స్టేషన్‌లో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో గాయపడిన వీరశేఖర్‌తో పోలీస్ స్టేషన్ ముందు 200 మంది గిరిజనులు ఆందోళనకు దిగారు. ఎస్ఐపై దాడికి యత్నించారు. వీరశేఖర్‌‌కు న్యాయం చేయాలని, ఎస్ఐని సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘటనపై ఎస్పీ రాజేంద్రప్రసాద్ విచారణకు ఆదేశించారు. 

Updated Date - 2021-11-12T21:41:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising