ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌లో ఇద్దరు అరెస్ట్‌

ABN, First Publish Date - 2021-10-01T19:58:24+05:30

తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. యూనియన్ బ్యాంక్‌ సంతోష్ నగర్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ మస్తాన్‌వలీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌లో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. యూనియన్ బ్యాంక్‌ సంతోష్ నగర్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ మస్తాన్‌వలీ, అగ్రసేన్ బ్యాంక్‌ మేనేజర్‌ పద్మావతిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తెలుగు అకాడమీ నిధుల గల్లంతు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. గల్లంతైన నిధుల మొత్తం పెరుగుతోంది. అకాడమీకే చెందిన మరో రూ.17 కోట్లు గల్లంతైన విషయం బయటకు వచ్చింది. హైదరాబాద్‌లోని కార్వాన్‌ యూనియన్‌ బ్యాంకు శాఖలో గత ఏడాది డిసెంబరు నుంచిఈ ఏడాది జూలై వరకూ పలు విడతలుగా రూ.43 కోట్లు గల్లంతైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే బ్యాంకుకు చెందిన సంతో్‌షనగర్‌ బ్రాంచ్‌లో రూ.8 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు కూడా జూలై, ఆగస్టు నెలల్లో గల్లంతయ్యాయి. కెనరా బ్యాంకు నుంచి మరో రూ.9 కోట్లను కూడా దారి మళ్లించి కాజేశారు. దాంతో, తాజాగా బయటపడిన రూ.17 కోట్లతో కలిపి మొత్తం కుంభకోణం విలువ రూ.60 కోట్లకు చేరుకుంది.


Updated Date - 2021-10-01T19:58:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising