ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు దోపిడీ దొంగల అరెస్ట్‌

ABN, First Publish Date - 2021-06-18T04:38:31+05:30

ఇద్దరు దోపిడీ దొంగల అరెస్ట్‌

నిందితులను చూపిస్తున్న ఏసీసీ పి.శ్రీనివాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



దామెర, జూన్‌ 17: దారి దోపిడీ, దొంగతనాలకు పాల్పడు తున్న ఇద్దరు నిందితులను గురువారం పోలీసులు పట్టుకు ని సెల్‌ఫోన్లు, రాగిపిండి బస్తాలు, బ్యాటరీ, హోండా యాక్టి వా వాహనం స్వాధీనం చేసుకున్నారు. కేవలం 48గంటల్లోనే దొంగలను పట్టుకోవడం గమనార్హం. ఘటన వివరాలను గురువారం పరకాలలోని ఏసీపీ పి.శ్రీనివాస్‌ తన కార్యాల యంలో వెల్లడించారు. 

ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన తనుగుల రాజు వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేంద్రం దేశాయిపేట్‌లోని ఎంహెచ్‌కా లనీలో ఉంటున్నాడు. ఇదే జిల్లా కేంద్రం పైడిపెల్లిలోని కొత్త గూడెం కాలనీ చెందిన జన్ను అజయ్‌ వరుసకు బావ, బావ మరుదులు. రాజు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగి స్తుండగా, అజయ్‌ డిగ్రీ చదువుతున్నాడు. రాజు రాత్రి వేళ ల్లో ఒంటరి ప్రయాణికులను ఎంచుకుని నిర్జన ప్రదేశాల్లోకి తీసుకెళ్లి దాడిచేసి విలువైన వస్తువులను దొంగిలించేవారు. అజయ్‌ డిగ్రీ చదువుకుంటూ చెడు అలవాట్లకు బానిసై రా జుతో స్నేహం చేస్తూ జల్సా కోసం దొంగతనాలకు పాల్పడు తున్నారు. ఈనెల 14నరాత్రి ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనం పై గూడెప్పాడ్‌ వైపు వెళ్తూ, దామెర క్రాస్‌ రోడ్‌ వద ్ద గణేష్‌ అనే బాటసారి వద్ద నుంచి సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు. అదే రాత్రి ఒగ్లాపూర్‌  శివారులోని సైలానీబాబా దర్గా వద్ద టాటా ఏస్‌ రిపేర్‌కు వచ్చి, నిలిచిపోగా, డ్రైవర్‌ కోడెపాక కుమార స్వామిని బెదరించి సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు. వాహనంలో ఉన్న ఆరు రాగి పిండి బస్తాలను అపహరించుకుని వెళ్లారు.  ఇద్దరు బాధితుల ఫిర్యాదుతో దామెర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గురువారం ఉదయం ఊరుగొండ శివారు కేఎస్సార్‌ స్కూల్‌ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు  చేప ట్టారు. యాక్టివా హోండా వస్తున్న నిందితులు పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకున్నారు. వారి రూ. 24వేల విలువైన రెండు సెల్‌ఫోన్లు, రాగి పిండి బస్తాలు, బ్యాటరీ, హోండా యాక్టివా వాహ నం స్వాధీనం చేసుకున్నారు. సీఐ టి.రమేష్‌కుమార్‌, ఎస్సై యు.భాస్కర్‌రెడ్డి, ఏఎస్సై ఆర్‌కె.చారి, పోలీసు కానిస్టేబళ్లు భరత్‌, వీరేందర్‌, శంకర్‌, ఫుల్‌సింగ్‌లను వరంగల్‌ సీపీ డాక్టర్‌ తరుణ్‌ జోషి అభినందించినట్లు తెలిపారు.  


Updated Date - 2021-06-18T04:38:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising