ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజీనామాకు సిద్ధమా?

ABN, First Publish Date - 2021-08-28T07:23:17+05:30

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలంగాణ వాడే అయినప్పటికీ ఆయన పలికే పలుకులు మాత్రం పరాయివేనని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రేవంత్‌... మల్లారెడ్డి సవాల్‌ను స్వీకరిస్తావా?
  • నువ్వు చంద్రబాబు తొత్తువి, బినామీవి!
  • బాబుకు టీ కాంగ్రెస్‌ ఫ్రాంచైజీ
  • ఆయన తరఫునే పీసీసీ చీఫ్‌ అయ్యావు
  • దాన్నే ప్రధాని పోస్టులా ఫీలవుతున్నావు
  • తెలంగాణ వాడివైనా నీవి పరాయి పలుకులే
  • రాష్ట్రం తెచ్చిన కేసీఆర్‌ను అలా తిట్టొచ్చా?
  • ముఖ్యమంత్రిని అడ్డగోలుగా తిడితే మహారాష్ట్రలో కేంద్ర మంత్రినే జైల్లో వేశారు
  • విలేకరుల సమావేశంలో మంత్రి కేటీఆర్‌


హైదరాబాద్‌, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలంగాణ వాడే అయినప్పటికీ ఆయన పలికే పలుకులు మాత్రం పరాయివేనని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ కాంగ్రెస్‌ను ఫ్రాంచైజీకి తీసుకున్నారనీ, అందుకే ఆయన తొత్తు, బినామీ అయిన రేవంత్‌ టీపీసీసీ చీఫ్‌ అయ్యారని వ్యాఖ్యానించారు. ఇటీవల మంత్రి మల్లారెడ్డి చేసిన రాజీనామా సవాల్‌ను రేవంత్‌ స్వీకరిస్తారో లేదో చెప్పాలని కేటీఆర్‌ డిమండ్‌ చేశారు. ఇష్టారీతిన వ్యవహరించినందుకే కొడంగల్‌ ప్రజలు ఆయన్ను తన్ని తరిమేశారని, మల్కాజిగిరిలో కూడా చావు తప్పి కన్ను లొట్టబోయి గెలిచారని అన్నారు. పీసీసీ అధ్యక్షుడు కాగానే రేవంత్‌ తానేదో భారత ప్రధాని అయినట్లుగా ఫీలవుతున్నారని వ్యాఖ్యానించారు. ఆయన ఎవరో,  ఆయన బతుకేంటో, ఎవరి మనిషో, ఎవరి కోసం ఇక్కడ మాట్లాడుతున్నారో తమకి తెలుసన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర దేనికోసం మొదలుపెట్టారో అర్థం కావడం లేదని కేటీఆర్‌ అన్నారు. 


ముఖ్యమంత్రిని బట్టేబాజ్‌ అంటున్నారు

ప్రతిపక్ష నేతలు సీఎం కేసీఆర్‌ గురించి మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తున్న భాష పట్ల కేటీఆర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విపక్షాల భాషకు సమాధానంగానే తమ పార్టీ నేతలు తీవ్రమైన పదజాలాన్ని వాడాల్సి వస్తోందని చెప్పారు. ఇటీవల తమ మంత్రి మల్లారెడ్డి కొంత ఆవేశానికి లోనై మాట్లాడింది నిజమేనని, ప్రతిపక్షాల వాళ్లు కూడా అలాగే మాట్లాడుతున్నారని చెప్పారు. సహనం, ఓపికకి కూడా హద్దులు, అవధులు ఉంటాయన్నారు. తెలంగాణ రాష్ట్ర కలని సాకారం చేసిన కేసీఆర్‌ని ఇష్టం వచ్చినట్టు రేవంత్‌, సంజయ్‌లు తిట్టడం కరెక్టేనా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. సీఎం కాలి గోటికి కూడా సరిపోని వాళ్లు ముఖ్యమంత్రిని పట్టుకొని బట్టేబాజ్‌ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రె్‌సకి ఎవరూ దిక్కులేక టీడీపీ నుంచి నేతను అరువు తెచ్చుకొని అధ్యక్షుడిని చేసుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు.  డబ్బుల సంచులతో దొరికిపోయిన వ్యక్తి కూడా కేసీఆర్‌ మీద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. మల్లారెడ్డి ఆవేశంలో స్పందిస్తే, అన్‌పార్లమెంటరీ పదాలు వాడారంటున్న మీడియా విపక్షాల తిట్లకు ప్రతిస్పందనగానే వాళ్లలా మాట్లాడుతున్నారని గుర్తించాలని కోరారు.


వరదలొస్తే ఒక్క రూపాయి ఇవ్వలేదు

బీజేపీ అధ్యక్షుడు సంజయ్‌ ఇంటిపేరు బండి అని, పెట్రోల్‌ ధరలు పెరగాయని బండి మీద కాకుండా పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో వరదలు వస్తే కేంద్రం నుంచి ఒక్క రూపాయి ఇవ్వలేదని, అదే గుజరాత్‌కు వేల కోట్లు ఇచ్చారని, ఇదే విషయాన్ని చెప్పి సంజయ్‌ పాదయాత్ర ప్రారంభించాలని సూచించారు. మేకిన్‌ ఇండియా... డిజిటల్‌ ఇండియా... ఫిట్‌ ఇండియా... స్కిల్‌ ఇండియాల కాలం అయిపోయిందని, ప్రస్తుతం బేచో ఇండియానే బీజేపీ విధానమని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇంకా ఏమైనా కేంద్ర ప్రభుత్వ ఆస్తులు మిగిలిపోతే గుర్తించి వాటిని అమ్మేద్దామని సంజయ్‌ పాదయాత్ర చేస్తున్నారా? అని ప్రశ్నించారు. మౌలాలిలో 21 ఎకరాల రైల్వే భూమిని కేంద్రం అమ్మకానికి పెడుతోందని, ఐదు ఎకరాల భూమిని డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి అడిగితే కేంద్రం అనుమతించడం లేదని చెప్పారు. 


అమ్మేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల్లో 11 లక్షల సర్కారీ ఉద్యోగాలు ఉన్నాయని, అందులో 1.6 లక్షల ఉద్యోగులు దళితులని, ఒక లక్ష మంది గిరిజనులున్నారని, రెండు లక్షల ఓబీసీ ఉద్యోగులు ఉన్నారని గుర్తు చేశారు. ఈ సంస్థల అమ్మకాల ద్వారా అందులో రిజర్వేషన్లను ఎగ్గొడతామని చెప్పడానికి సంజయ్‌ పాదయాత్ర చేస్తున్నారా? అని ప్రశ్నించారు. కరోనా సమయంలో రూ. 20 లక్షల కోట్ల  ప్యాకేజీ అంటూ కేంద్రం ఊదర గొట్టిందని, దేశ ప్రజల చెవుల్లో పెట్టిన క్యాబేజీ గురించి చెప్పేందుకు సంజయ్‌ పాదయాత్ర చేస్తున్నారా? అని అడిగారు. తెలంగాణ ప్రజలు కేంద్రానికి రూ.2.72 లక్షల కోట్లు పన్నులు కడితే వెనక్కి ఇచ్చినవి రూ.1.40 లక్షల కోట్లు మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు తాము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో ఇదివరకే శ్వేతపత్రం విడుదల చేశామని చెప్పారు. ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉందని, రాను న్న రోజుల్లో అన్నీ భర్తీ చేస్తామని తెలిపారు. కేంద్రంలో 8 లక్షల ఖాళీలను ఎందుకు భర్తీ చేయరో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు.


కేసీఆర్‌ తిట్టిన  సందర్భం వేరు

రాజకీయాల్లో సంస్కారంగా మాట్లాడటం చాలా ముఖ్యమని, ఏడేళ్లు ఓపిక పట్టామని, ఇక సహించడం తమ నేతలతో కావడం లేదని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఠాక్రేని ఒక్క మాట అన్నందుకే కేంద్ర మంత్రిని జైల్లో వేశారని కేటీఆర్‌ గుర్తు చేశారు. ఇక్కడ సీఎంను ఇష్టారీతిన తిడుతున్నా భరిస్తున్నామని చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వం మాదిరి జైల్లో వేస్తే ఇదే మీడియా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ గొడవ చేస్తుందని వ్యాఖ్యానించారు. కొంతమంది జర్నలిస్టులు కూడా జర్నలిజం ముసుగులో సీఎం కేసీఆర్‌ను ఇష్టమోచ్చినట్లు తిడుతున్నారని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రికా స్వేచ్ఛకు కూడా పరిమితులుంటాయని కేటీఆర్‌ హెచ్చరించారు.  కాంగ్రెస్‌ నేతలు, బీజేపీ నాయకులు దారుణంగా తిడుతుండటంతో తాము కూడా అదే భాషలో ఎదురు సమాధానం ఇవ్వాల్సి వస్తోందని తెలిపారు. తిట్ల సంస్కృతిని కేసీఆరే షురూ చేశారని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, ఉద్యమ సమయంలో విద్యార్థులు చనిపోతుంటే వారి ఉద్వేగాన్ని వెలిబుచ్చే క్రమంలో కేసీఆర్‌ తీవ్ర పదజాలాన్ని ఉపయోగించాల్సి వచ్చిందన్నారు. 


సెప్టెంబరు2న టీఆర్‌ఎస్‌ జెండా పండగ

సెప్టెంబరు2న టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో జెండా పండగ నిర్వహిస్తామని కేటీఆర్‌ చెప్పారు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పార్టీ జెండాను సంబంధిత బాధ్యులు ఎగరవేస్తారన్నారు. అదే రోజు నుంచి గ్రామ కమిటీల నిర్మాణం మొదలవుతుందని వివరించారు. సెప్టెంబరు 2నే ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి కేసీఆర్‌ శంకుస్థాపన చేస్తారన్నారు.  సెప్టెంబర్‌ 2 నుంచి 12 వరకు గ్రామ, వార్డు కమిటీలు, 12 నుంచి 20 వరకు మండల కమిటీలు పూర్తి చేస్తామని చెప్పారు. 20 తర్వాత జిల్లా కమిటీల నిర్మాణం పూర్తవుతుందన్నారు. హైదరాబాద్‌లో బస్తీ కమిటీలు, డివిజన్‌ కమిటీలు వేస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మహిళలకు 51% ప్రాతినిధ్యం ఉండేట్లు చూస్తామని ప్రకటించారు. రెండు, మూడు రోజులలో  జీహెచ్‌ఎంసీ పరిధిలోని పార్టీ ప్రతినిధులతో సమావేశమవుతానన్నారు. 

Updated Date - 2021-08-28T07:23:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising