ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో ఆర్థిక నేరం!!

ABN, First Publish Date - 2021-08-02T07:52:08+05:30

ఏపీ ప్రభుత్వ ఆర్థిక అక్రమాల అడ్డాగా ఉన్న రాష్ట్రాభివృద్ధి సంస్థ (ఏపీఎ్‌సడీసీ) గుట్టు జాతీయ స్థాయిలో రట్టవడంతో.. జగన్‌ సర్కారు కొత్త అప్పుల కోసం కొత్త కంపెనీని లైన్లోకి తెచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీఎస్‌డీసీ గుట్టు రట్టవడంతో తెరపైకి ఇంకో కంపెనీ 

పేరు.. స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ 


(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఏపీ ప్రభుత్వ ఆర్థిక అక్రమాల అడ్డాగా ఉన్న రాష్ట్రాభివృద్ధి సంస్థ (ఏపీఎ్‌సడీసీ) గుట్టు జాతీయ స్థాయిలో రట్టవడంతో.. జగన్‌ సర్కారు కొత్త అప్పుల కోసం కొత్త కంపెనీని లైన్లోకి తెచ్చింది. ‘ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పేరు’తో ఈ కంపెనీని రాష్ట్ర ఆర్థిక శాఖ భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ)కి చెందిన హైదరాబాద్‌ బ్రాంచ్‌లో నమోదు చేసింది. దీనిని నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ(ఎన్‌బీఎ్‌ఫసీ)గా, నాన్‌ డిపాజిట్‌ టేకింగ్‌ విభాగం కింద ఆర్‌బీఐ నమో దు చేసుకుంది. అంటే ఎలాంటి డిపాజిట్లు స్వీకరించకూడదు. కానీ గడచిన నెల రోజుల్లోనే స్కూళ్లు, కాలేజీలు, బోర్డులు, వర్సిటీలు, కొన్ని కార్పొరేషన్ల నుంచి 5 శాతం వడ్డీకి రూ.3,000 కోట్ల డిపాజిట్లను ఈ కంపెనీ స్వీకరించింది. అప్పుల పరిమితిని తప్పించుకోవడానికి ఇదొక ఎత్తుగడ. ప్రస్తుతం బ్యాంకులు అప్పులివ్వడం లేదు. కేంద్రం ఇచ్చిన పరిమితి దాటిపోయింది.


కానీ అయిపోలేదంటూ ఆర్థికశాఖ ఆర్‌బీఐకి తప్పుడు లెక్కలు చూపుతోంది. ఎస్‌డీసీపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పడంతో దాన్ని వదిలేసి కొత్తగా ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ను అడ్డం పెట్టుకుని.. అంతో ఇంతో డబ్బులుండే కార్పొరేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, బోర్డులు, వర్సిటీల డబ్బులను 5 శాతం వడ్డీ ఆశ చూపి లాగేసుకుంటూ.. వాటి ఖాతాలను ఖాళీ చేసే పనిలో పడ్డారు. నిజానికి ఈ అత్యవసర నిధులను ఆయా ఖాతాల నుంచి మొదట ఆ కంపెనీకి.. అక్కడి నుంచి రాష్ట్ర ఖజానాకు మళ్లించారు. అలా ఈ నిధులను ప్రభుత్వం వాడుకుంటోంది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి నుంచి తప్పించుకునేందుకు ఎస్‌డీసీని ఏర్పా టు చేసి ఎలా కేంద్రానికి దొరికిపోయారో.. ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేస్తున్నారు. 

Updated Date - 2021-08-02T07:52:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising