ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ హైకోర్టు తీర్పు వాయిదా

ABN, First Publish Date - 2021-07-24T07:57:39+05:30

జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న పలువురు నిందితులు, సంస్థలు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్లు, సీబీఐ కేసుల విచారణ తర్వాతే ఈడీ కేసులు విచారించాలని కోరుతూ దాఖలైన ప

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి): జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న పలువురు నిందితులు, సంస్థలు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్లు, సీబీఐ కేసుల విచారణ తర్వాతే ఈడీ కేసులు విచారించాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ తీర్పును వాయిదావేశారు. సీబీఐ, ఈడీ కేసుల్లోంచి తమ పేరన్లు తొలగించాలంటూ ఇండియా సిమెంట్స్‌ అధినేత ఎన్‌.శ్రీనివాసన్‌, విజయసాయిరెడ్డి, ఇండియా సిమెంట్స్‌, భారతి సిమెంట్స్‌, జగతి పబ్లికేషన్స్‌, కార్మెల్‌ ఏషియా సంస్థలు క్వాష్‌ పిటిషన్లు దాఖలు చేసి సంగతి తెలిసిందే. తొలుత ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన సీబీఐ కేసులను ముందు విచారించాలని లేదంటే.. ఈడీ కేసుల్లో సమాంతర విచారణ చేయాలని విజయసాయిరెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదించారు. దీనిపై ఈడీ తరఫున అదనపు సోలిసిటర్‌ జనరల్‌ సూర్యకరణ్‌రెడ్డి విభేదించారు. క్రిమినల్‌ కేసులు వీగిపోయినా.. ఈడీ కేసుల్లో విచారణ కొనసాగించవచ్చని తెలిపారు. కాగా.. తమపై నమోదు చేసిన కేసుల విచారణ నిలిపివేయాలని కోరుతూ హెటిరో గ్రూపు సంస్థల ఎండీ శ్రీనివాసరెడ్డి, ఇండియా సిమెంట్స్‌, ఎంబసీ రియల్టర్స్‌ దాఖలు చేసిన కేసుల్లో విచారణ నిలుపుదల చేస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు పొడిగించి, ఆయా వ్యాజ్యాల విచారణను 8కి వాయిదా వేసింది.

Updated Date - 2021-07-24T07:57:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising