ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చే 1 నుంచి ఎంసెట్‌ బైపీసీ కౌన్సెలింగ్‌

ABN, First Publish Date - 2021-11-28T09:19:22+05:30

రాష్ట్రంలో 2021-22 విద్యాసంవత్సరానికి గాను బీ ఫార్మసీ, ఫార్మా-డీ, బయోటెక్నాలజీ, ఫార్మాసూటికల్‌, ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్‌ బైపీసీ విద్యార్థులకు వచ్చే నెల 1 నుంచి తొలి విడత కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2021-22 విద్యాసంవత్సరానికి గాను బీ ఫార్మసీ, ఫార్మా-డీ, బయోటెక్నాలజీ, ఫార్మాసూటికల్‌, ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్‌ బైపీసీ విద్యార్థులకు వచ్చే నెల 1 నుంచి తొలి విడత కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, ఎంసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ నవీన్‌ మిట్టల్‌ శనివారం ఒక ప్రకటనలో ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. వచ్చే నెల 1 నుంచి 3 వరకు ఆన్‌లైన్‌లో ప్రాథమిక సమాచారం అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. ఆన్‌లైన్‌లోనే ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాలని, సహాయ కేంద్రాలకు వెళ్లేందుకు స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. 3, 4 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని, 5వ తేదీ వరకూ వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశముంటుందని తెలిపారు. 7న తొలివిడత కౌన్సెలింగ్‌ ద్వారా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. 

Updated Date - 2021-11-28T09:19:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising