ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చార్మినార్ వద్ద ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ ఆజాదీకా అమృత్ మహోత్సవం

ABN, First Publish Date - 2021-08-14T23:47:28+05:30

ఆజాది కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో లోని నెహ్రూ యువ కేంద్రం శనివారం ఉదయం చారిత్రక చిహ్నమయిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఆజాది కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ  అధ్వర్యంలో లోని నెహ్రూ యువ కేంద్రం శనివారం  ఉదయం చారిత్రక చిహ్నమయిన చార్మినార్ వద్ద ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. నెహ్రూ యువ కేంద్ర తెలంగాణా ప్రాంతీయ కార్యాలయం చేపట్టిన ఈ పరుగును హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎల్. శర్మన్ ముఖ్య అతిథిగా హాజరయి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా శర్మన్ మాట్లాడుతూ, చక్కని ఆరోగ్యం కోసం పౌరులందరూ రోజూవారీ జీవితంలో కనీసం 30 నిమిషాల శారీరక ధారుడ్య క్రియలను  అలవాటుగా చేసుకోవాలని సూచించారు. 


ఈ అంశం తెలియచేయడమే ఈ పరుగు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని అన్నారు.కార్యక్రమంలో భాగంగా యువతతో ఫిట్ ఇండియా ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ గీతం పాడిన తరువాత వందలాది మంది విద్యార్థులు చార్మినార్ నుండి మదీనా వరకు పరుగు సాగించారు.సామాజిక దూర నిబంధనలను పాటిస్తూ శారీరకంగా దృఢంగా, చురుగ్గా ఉండడానికి ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ లో భాగంగా , హైదరాబాద్ లోని నెహ్రూ యువ కేంద్రం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.


సుమారు 100 కు పైగా, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, నెహ్రూ యువ కేంద్రం అనుబంధ సంస్థల ప్రతినిధులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ పరుగులో ఉత్సాహముగా పాల్గొన్నారు. నెహ్రూ యువ కేంద్ర రాష్ట్ర సంచాలకులు అంశుమన్ ప్రసాద్ దాస్ , డీసీపి-సౌత్ జోన్ గజారావుభూపాల్, ముఖ్య ప్రణాళికా అధికారి డా. ఎన్.సురేంద్ర, ఏసీపీ భిక్షం రెడ్డి, యువత, సంక్షేమ అధికారి సుధాకర్ తో సహా పలువురు అధికారులు, ప్రముఖులు , నెహ్రూ యువ కేంద్రం అధికారులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

Updated Date - 2021-08-14T23:47:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising