ఎల్బీనగర్ నుంచి అమీర్పేట్ మెట్రో రైల్లో సాంకేతిక లోపం
ABN, First Publish Date - 2021-02-08T17:41:04+05:30
నగరంలోని మెట్రో రైల్లో మరోసారి లోపాలు బయటపడ్డాయి. ఎల్బీనగర్ నుంచి అమీర్పేట్ మార్గంలో 20నిమిషాల పాటు మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో ఉదయం వేళ ప్రయాణికులు...
హైదరాబాద్: నగరంలోని మెట్రో రైల్లో మరోసారి లోపాలు బయటపడ్డాయి. ఎల్బీనగర్ నుంచి అమీర్పేట్ మార్గంలో 20నిమిషాల పాటు మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో ఉదయం వేళ ప్రయాణికులు ఆఫీసులకు వెళ్లే టైం కావడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గడిచిన 20రోజుల్లో తరచుగా సాంకేతిక సమస్యలు రావడంతో ప్రయాణికుల్లో ఆందోళన చెందుతున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందిస్తూ సాంకేతిక లోపం వల్ల మెట్రో ట్రైన్ పట్టాలపై నిలిచిపోయిందని అధికారులు తెలిపారు.
Updated Date - 2021-02-08T17:41:04+05:30 IST