ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణకు 10లక్షల 50 వేల యూరియా కేటాయింపు

ABN, First Publish Date - 2021-07-21T04:47:35+05:30

ఈ వానాకాలంలో రాష్ట్రానికి కేంద్రం 10లక్షల 50 వేల యూరియా కేటాయింపు చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ఈ వానాకాలంలో రాష్ట్రానికి కేంద్రం 10లక్షల 50 వేల యూరియా కేటాయింపు చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ఎరువుల శాఖ మంత్రి మాన్‌సుఖ్ మాండ‌వియాతో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి భేటి అయ్యారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన యూరియా సరఫరా అంశంపై చర్చ జరిగింది. సమావేశంలో టీఆర్‌ఎస్ లోక్ సభ పక్షనేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు సురేష్ రెడ్డి, రాములు, బండ ప్రకాష్, బడుగుల లింగయ్య, బిబి పాటిల్, మన్నే శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. కేటాయించిన యూరియాను జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నెలవారీగా సరఫరా చేస్తారని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. జూన్, జులై నెలల సరఫరాలో 93 వేల మెట్రిక్ టన్నుల యూరియా లోటు సరఫరా ఉందని ఆయన తెలిపారు. లోటు సరఫరా ఉన్నదాన్ని కూడా కలిపి ఒకేసారి మొత్తం పంపించాలని విజ్ఞప్తి చేసామన్నారు. 


విదేశాల నుంచి త్వరగా వచ్చే యూరియా కోటాలో తెలంగాణకు కేటాయించాలని కోరామన్నారు. సీజనల్ గా దక్షిణాదిలో తెలంగాణ రాష్ట్రంలోనే మొదటగా నాట్లు పడతాయని ఆయన వివరించారు. సీజనల్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముందుగా తెలంగాణకి యూరియా ఇవ్వాల్సిందిగా కోరామన్నారు. తెలంగాణ రాష్ట్రం పురోగమిస్తున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ బాగా పనిచేస్తున్నారని కేంద్రమంత్రి మాన్‌సుఖ్ మండవియా అభినందించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్రానికి యూరియా ఇబ్బంది రానివ్వమని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-07-21T04:47:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising