ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్‌కు అల్లం నారాయణ కృతజ్ఞతలు

ABN, First Publish Date - 2021-03-04T23:22:20+05:30

సీఎం కేసీఆర్‌కు అల్లం నారాయణ కృతజ్ఞతలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధికి మరో 17 కోట్ల 50 లక్షల రూపాయల నిధులను విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు, పురుపాలక, ఐ.టి. శాఖ మంత్రి కె. తారాక రామారావుకు జర్నలిస్టుల తరుపున తెలంగాణ  రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమ నిధికి 100 కోట్ల కార్పస్ ఫండ్‌లో భాగంగా ఇప్పటికే 34 కోట్ల 50 లక్షల రూపాయలు మంజూరు కాగా, నేడు 17 కోట్ల 50 లక్షల రూపాయలను జమ అయ్యాయని, దీనితో ఇప్పటి వరకు సంక్షేమ నిధికి 52 కోట్ల రూపాయలకు చేరుకుందని తెలిపారు. ఈ సంక్షేమ నిధితో జర్నలిస్టులకు మరింతగా ఉపయోగ పడే విధంగా సంక్షేమ కార్యక్రమాలను రూపొందించడానికి అవకాశం ఉందని అకాడమి చైర్మన్ తెలిపారు.  జర్నలిస్టుల వెంట ఉండి, జర్నలిస్టుల సంక్షేమ నిధికి నిధులు రాబట్టడానికి కృషి చేసిన ఆందోల్ శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 


బుధవారంనాడు పురపాలక, ఐ.టి. శాఖా మాత్యులు కె.టి.ఆర్.తో సమావేశమై జర్నలిస్టుల సమస్యలపై మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ ఆయన దృష్టికి తీసుకునిరాగా, మంత్రి జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. ఈ నెల 7వ తేదీన జల విహార్‌లో జర్నలిస్టుల కుటుంబాలకు పురపాలక, ఐ.టి. శాఖ మంత్రి కె. తారక రామారావు చేతుల మీదుగా జర్నలిస్టుల సంక్షేమ నిధి కింద ఎంపికైన లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేయనున్నట్లు మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.

Updated Date - 2021-03-04T23:22:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising