ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరంగల్‌ తూర్పు జర్నలిస్టుల సంఘం స్ఫూర్తిదాయకం

ABN, First Publish Date - 2021-04-13T06:17:40+05:30

వరంగల్‌ తూర్పు జర్నలిస్టుల సంఘం స్ఫూర్తిదాయకం

సమావేశంలో మాట్లాడుతున్న అల్లం నారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ


ఓసిటీ(వరంగల్‌), ఏప్రిల్‌ 12: వరంగల్‌ తూర్పు జర్నలిస్టుల పరపతి సంఘం రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ స్ఫూ ర్తి అని మీడియా అకాడమీ చైర్మన్‌, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ కితాబునిచ్చారు. వరంగల్‌ లక్ష్మీపురంలోని సంఘ భవనాన్ని సోమవారం ఆయన ఆంథోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నారాయణ మాట్లాడుతూ  వరంగల్‌ తూర్పు నియోజకవర్గ పరిధిలోని జర్నలిస్టులు సంఘటితంగా పరపతి సంఘాన్ని ఏర్పాటు చేసుకొని అభివృద్ధి పథంలో దూసుకుపోతుండడం అభినందనీయమని కొనియాడారు. ప్రతీ జిల్లాలో జర్నలిస్టులు పరపతి సంఘాలను ఏర్పాటు చేసుకునేలా వరంగల్‌ తూర్పు జర్నలిస్టుల పరపతి సంఘం ఆదర్శంగా నిలిచిందన్నారు.  

తూర్పు ఎమ్మెల్యే నరేందర్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి తూర్పు జర్నలిస్టులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌తో శంకుస్థాపన చేయించడం సంతోషకరమన్నారు.  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. కొవిడ్‌ బారిన పడిన జర్నలిస్టులకు మీడియా అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందించిందని తెలిపారు. ఆంథోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, మాట్లాడుతూ ఐక్యంగా ఉండటం ద్వారా జర్నలిస్టులు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.  ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. 

సంఘం అధ్యక్షుడు కోరుకొప్పుల నరేందర్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇంకా టీ యూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు లెనిన్‌,  డెస్క్‌ జర్నలిస్టుల ఫోరం కన్వీనర్‌ శంకర్‌రావు శెంకేసి, టీ యూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర కార్యదర్శి గాడిపెల్లి మధు, ప్రెస్‌క్లబ్‌ అధ్యక్ష, ప్రధానకార్యదర్శు లు శ్రీధర్‌రెడ్డి, వెంకట్‌, తూర్పు జర్నలిస్టుల సం ఘం ప్రధానకార్యదర్శి బండి రవి, కోశాధికారి వడిచర్ల శ్రీనివాస్‌, ఉపాధ్యక్షులు మధు, స్వామి, శ్రీధర్‌, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టు కాలనీకి శంకుస్థాపన

దేశాయిపేటలోని లక్ష్మి మెగాటౌన్‌షి్‌ప సమీపంలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల జర్నలిస్టు కాలనీకి మంత్రి కేటీఆర్‌ సోమవారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యేలు నరేందర్‌, క్రాంతికిరణ్‌,  మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, ఏపీ ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్‌, జర్నలిస్టు సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-13T06:17:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising