ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జైలు నుంచి విడుదలైన అఖిలప్రియ

ABN, First Publish Date - 2021-01-24T00:02:10+05:30

మాజీమంత్రి అఖిలప్రియ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితురాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మాజీమంత్రి అఖిలప్రియ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితురాలు ఉన్న అఖిలప్రియకు సెషన్స్‌ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరుచేసింది. రూ.10 వేల పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. బెయిల్ ఆర్డర్ కాపీలను చంచల్‌గూడ జైలు  అధికారులు ఆమె తరపు న్యాయవాదులు సమర్పించారు. అనంతరం ఆమెను జైలు నుంచి అధికారులు విడుదల చేశారు. అఖిలప్రియకు స్వాగతం పలికేందుకు ఆమె స్వంత గ్రామం ఆళ్లగడ్డ నుంచి భారీగా టీడీపీ కార్యకర్తలు వచ్చారు. కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ చంచల్‌గూడ జైల్లో 17 రోజులుగా రిమాండ్‌లో ఉంటున్న విషయం తెలిసిందే. 


అఖిలప్రియకు కోర్టు విధించిన షరతులివే..

ప్రతి సోమవారం బోయినపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంతకం చేయాల్సిందే.

పదివేల రూపాయలు, రెండు పూచీకత్తులు సమర్పించాలి.

హైదరాబాద్‌ నగరాన్ని విడిచి ఎక్కడికీ వెళ్ళడానికి వీల్లేదు.

పోలీసుల విచారణకు సహకరించాలని షరుతులతో కూడిన బెయిల్‌ను సెషన్స్‌ కోర్టు మంజూరు చేసింది. 

Updated Date - 2021-01-24T00:02:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising