ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అఖిలప్రియకు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌

ABN, First Publish Date - 2021-01-14T21:08:35+05:30

మాజీ మంత్రి అఖిలప్రియకు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించారు. ఆమెను న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపర్చారు. కోర్టు సెలవు కారణంగా ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మాజీ మంత్రి అఖిలప్రియకు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. ఆమెను న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపర్చారు. కోర్టు సెలవు కారణంగా న్యాయమూర్తి నివాసంలో అఖిలప్రియను హాజరుపర్చారు. 3 రోజుల విచారణ స్టేట్‌మెంట్‌ను న్యాయమూర్తికి పోలీసులు అందజేశారు. దీంతో అఖిలప్రియకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అనంతరం ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. బెయిల్‌ ఇవ్వాలని అఖిలప్రియ తరపు న్యాయవాదులు కోరారు.


కాగా కస్టడీలో భాగంగా బేగంపేట మహిళా పీఎస్‌లో 3 రోజులు అఖిలప్రియను పోలీసులు ప్రశ్నించారు. అనంతరం ఆమెకు బేగంపేట్ పాటిగడ్డ హెల్త్ కేర్ సెంటర్‌లో కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆమెకు నెగెటివ్‌గా తేలింది. అనంతరం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈసీజీ, చెస్ట్ ఎక్స్‌రే, గైనకాలజి డిపార్ట్‌మెంట్‌లో పరీక్షలు నిర్వహించారు. న్యూరాలజీ వైద్యులు పరీక్షలు జరిపారు. 


Updated Date - 2021-01-14T21:08:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising