ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అఖిల ప్రియ బెయిల్ పిటీష‌న్‌పై కొనసాగుతున్న సందిగ్ధత

ABN, First Publish Date - 2021-01-19T15:43:32+05:30

ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ బెయిల్ పిటీషన్‌పై సందిగ్దత కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ బెయిల్ పిటీషన్‌పై సందిగ్దత కొనసాగుతోంది. బోయినపల్లి కిడ్నాప్ కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న అఖిల ప్రియ నాంపల్లి సెషన్స్ కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ జరగనుంది. కాగా మరో ముగ్గురు నిందితుల కస్టడీ పిటిషన్‌పై సికింద్రాబాద్ కోర్ట్ ఇవాళ తుది తీర్పు ఇవ్వనుంది. మరోవైపు ఈ కేసులో ఏ-3గా ఉన్న అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 21న విచారణ జరగనుంది.


బోయినపల్లి కిడ్నాప్ కేసులో భూమా అఖిల ప్రియకు సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురైంది. ఆమె బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. అఖిల ప్రియపై అదనపు సెక్షన్లు నమోదు చేసినట్లు పోలీసులు మెమో దాఖలు చేశారు. ఐపీసీ సెక్షన్ 395 డెకయిట్ (దోపిడీ) కేసు నమోదు చేశారు. జీవిత కాలం శిక్ష పడే కేసులు తమ పరిధిలోకి రావని సికింద్రాబాద్ కోర్టు తిరస్కరించింది. దీంతో నాంపల్లి కోర్టులో అఖిల ప్రియ తరుపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేశారు. దీనిపై మంగళవారం విచారణ జరగనుంది.

Updated Date - 2021-01-19T15:43:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising