ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజల్లో చిరుధాన్యాలపై ఆసక్తి పెరుగుతోంది

ABN, First Publish Date - 2021-12-02T21:58:59+05:30

ప్రజల్లో చిరుధాన్యాలపై ఆసక్తి పెరుగుతోందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డా. ప్రవీణ్ రావు అభిప్రాయపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రజల్లో చిరుధాన్యాలపై ఆసక్తి పెరుగుతోందని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డా. ప్రవీణ్ రావు అభిప్రాయపడ్డారు. తదనుగుణంగా వాటి సాగు విస్తీర్ణం పెరగవలసిన అవసరం వుందన్నారు. గురువారం వైస్ ఛాన్సలర్ ఛాంబర్ లో పిజెటీఎస్ఏయు, అమ్యూస్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ల మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. వర్శిటీ తరపున పరిశోధనా సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్, అమ్యూస్ తరపున వంశీ క`ష్ణ ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. చక్కెర స్థాయిల్ని తగ్గించడానికి ఉపకరించే తెలంగాణ సోనాకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోందన్నారు. 


ఈ బియ్యం వినియోగాన్ని ప్రజల్లోకి , గ్రామీణ ప్రాంతాలకి మరింత చేరువ చేయాలని డా. ప్రవీణ్ రావు సూచించారు. సంస్ధలు కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని రైతులతో నేరుగా ఒప్పందాలుచేసుకుని ధాన్యం కొనుగోలు చేస్తే రైతులకు మంచి ధర లభించడంతో పాటు వినియోగ దారులకు నాణ్యతతో కూడిన ఉత్పత్తులు అందుతాయని అన్నారు. అవసరమైన సాంకేతిక విషయాలను ఎప్పటికప్పుడు విశ్వ విద్యాలయం అందిస్తుందన్నారు. నాణ్యతతో కూడిన శుభ్రమైన ఆహార ఉత్పత్తుల పై పల్లెలు,పట్టణ ప్రాంతాల్లోనూ అవగాహన పెరిగిందని ప్రవీణ్ రావుఅభిప్రాయపడ్డారు. 

Updated Date - 2021-12-02T21:58:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising