ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌ నాయకత్వంపై తిరుగుబాటు రాబోతోంది.. రేవంత్ జోస్యం

ABN, First Publish Date - 2021-10-18T22:57:52+05:30

టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హుజురాబాద్ ఎన్నిక తర్వాత కేసీఆర్‌ నాయకత్వంపై తిరుగుబాటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హుజురాబాద్ ఎన్నిక తర్వాత కేసీఆర్‌ నాయకత్వంపై తిరుగుబాటు రాబోతోందని జోస్యం చెప్పారు. 2022 ఆగస్టులో గుజరాత్ ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నికలూ జరుగుతాయని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళ్తారని రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు. మంత్రి హరీష్‌రావుకు చివరకు మిగిలేది మిత్రద్రోహి టైటిల్ మాత్రమేనని తెలిపారు. కేసీఆర్‌, హరీష్‌రావును పూర్తిగా ఇంటికి పంపే ప్లాన్ చేశారని ఆరోపించారు. తిరుగుబాటును ఎదుర్కొనేందుకే కేసీఆర్ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారని ఎద్దేవాచేశారు. ఎవరు అడగకుండానే ముందస్తు ఎన్నికల చర్చ ఎందుకు తీసుకొచ్చారో కేసీఆరే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. యూపీ ఎన్నికల్లో ఎంఐఎం సహకారంతో బీజేపీని బలోపేతం చేయడానికి కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ అసహనంతో ఉన్నారని, ప్రతిపక్షాలను కుక్కలు, నక్కలతో పోల్చడమే ఇందుకు నిదర్శనమన్నారు. అభద్రతాభావంతో కేసీఆర్ పొంతన లేని స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు.

Updated Date - 2021-10-18T22:57:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising