ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్పొరేట్‌ స్థాయిలో వైద్యం అందించాలి

ABN, First Publish Date - 2021-03-07T05:05:09+05:30

కార్పొరేట్‌ స్థాయిలో వైద్యం అందించాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఇన్‌చార్జి కలెక్టర్‌ కృష్ణఆదిత్య

భూపాలపల్లి కలెక్టరేట్‌, మార్చి 6 : జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో కార్పొరేట్‌ స్థాయిలో ప్రజలకు వైద్యసేవలు అందేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ కృష్ణఆదిత్య వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన జిల్లా ఆస్పత్రి భవనాన్ని ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆస్పత్రిలో జనరల్‌ ఫిజీషియన్‌, జనరల్‌ సర్జన్‌, గైనకాలజిస్ట్‌, స్టాఫ్‌నర్సు, ఫార్మసి్‌స్టలు, ల్యాబ్‌ టెక్నిషియన్స్‌ ఇతర సిబ్బందిని అంచెలంచెలుగా నియమించుకునేందుకు చర్యలు తీసుగికోవాలన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ట్రయల్‌ రన్‌ పద్ధతిలో వైద్యసేవలు అందిస్తూ త్వరలోనే ప్రజాప్రతినిధులచే పూర్తిస్థాయిలో ప్రారంభానికి చర్యలు తీసుకోవాలన్నారు. భూపాలపల్లి, కాటారం పీహెచ్‌సీ, మహదేవ్‌పూర్‌ సీహెచ్‌సీలో ఎక్స్‌రే యంత్రాన్ని సమకూర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ సుధార్‌సింగ్‌, డీసీహెచ్‌ఎ్‌స జీడీ తిరుపతి, ప్రోగ్రాం అధికారిణులు ఉమాదేవి, మమతాదేవి పాల్గొన్నారు.

Updated Date - 2021-03-07T05:05:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising