ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువత గంజాయికి బానిసకావద్దు

ABN, First Publish Date - 2021-10-26T03:22:56+05:30

యువత గంజాయికి బానిసకావద్దని ఏసీపీ నరేందర్‌ అన్నారు. శ్రీరాంపూర్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో సోమవారం ‘చెడు వ్యసనాల పై యువతకు అవగాహన సదస్సు’ జరిగింది. ఏసీపీ మాట్లాడుతూ గంజాయి, గుట్కా, సిగరేట్‌కు యువత బానిస కాకుండా ఉన్నత చదువులు అభ్యసించి ఉన్న తమైన స్థానాలకు ఎదగాలన్నారు.

శ్రీరాంపూర్‌లో అవగాహన సదస్సులో మాట్లాడుతున్న ఏసీపీ నరేందర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నస్పూర్‌, అక్టోబరు 25: యువత గంజాయికి బానిసకావద్దని ఏసీపీ నరేందర్‌ అన్నారు. శ్రీరాంపూర్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో సోమవారం ‘చెడు వ్యసనాల పై యువతకు అవగాహన సదస్సు’ జరిగింది. ఏసీపీ మాట్లాడుతూ గంజాయి, గుట్కా, సిగరేట్‌కు యువత బానిస కాకుండా ఉన్నత చదువులు అభ్యసించి ఉన్న తమైన స్థానాలకు ఎదగాలన్నారు.  కొందరు విద్యార్థి దశలో వ్యసనాలకు బానిస అవుతున్నారని, అలాంటి వారిని తల్లిదండ్రులు గుర్తించి మాన్పించాలన్నారు.  గంజాయి, గుట్కాలు వినియోగిస్తున్న, సరఫరా చేస్తు న్న వారి జాబితాలను తయారు చేశామని, వారు పద్ధ తి మార్చుకోకుంటే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. సదస్సులో సీఐ బి.రాజు, ఎస్సై మంగీలాల్‌, ప్రోబేషనరీ ఎస్సై సంధ్యా పాల్గొన్నారు.  

జైపూర్‌: యువత మత్తు పదార్ధాలు సేవిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ రామకృష్ణ పేర్కొన్నారు. నర్సింగపూర్‌ (ఎస్‌)లో యువకులకు మత్తు పదార్ధా లు తీసుకోవద్దని అవ గాహన కల్పించారు. గంజాయి సాగు చేసినా, విక్రయించినా, రవాణా చేసినా పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.  ఎంపీటీసీ స్వాతి, రాజన్న పాల్గొన్నారు. 

బెల్లంపల్లి : గంజాయికి యువత దూరంగా ఉండాలని, చెడు వ్యసనాలకు బానిస కాకుండా చక్క గా చదువుకుని ఉన్నతస్థాయి ఉద్యోగాలు సాధించా లని ఏసీపీ ఎడ్ల మహేష్‌ పేర్కొన్నారు. మాల గురి జాలలో గంజాయి నిర్మూలన అవగాహన సదస్సు నిర్వహించారు. బెల్లంపల్లి రూరల్‌ సీఐ జగదీష్‌, పీఎస్‌ఐ గంగాధర్‌, సర్పంచు అశోక్‌, ఎంపీటీసీ శకుంతల , గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. 

- గంజాయి రహిత సమాజం కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని టూటౌన్‌ ఎస్‌ఐ కిరణ్‌ పేర్కొన్నారు.  12వ వార్డు కౌన్సిలర్‌ నెల్లి శ్రీలత ఆధ్వర్యంలో అవ గాహన సదస్సు నిర్వహించారు. ఏఎస్‌ఐ నర్సయ్య, వార్డు ప్రజలు పాల్గొన్నారు. 

కోటపల్లి: గంజాయి విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుం టామని చెన్నూరు రూరల్‌ సీఐ నాగరాజు హెచ్చరించారు. మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలైన వెల్మపల్లి, లక్ష్మీపూర్‌, అన్నా రం, అర్జునగుట్ట గ్రామాల్లోని దుకాణాల్లో తనిఖీలు నిర్వహిం చారు.  యువత గంజాయికి అలవాటు కావద్దన్నారు.  

Updated Date - 2021-10-26T03:22:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising