ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళలు భయాన్ని వీడి చట్టాలను వినియోగించుకోవాలి

ABN, First Publish Date - 2021-03-07T03:47:14+05:30

మహిళలు భయాన్ని వీడి వారి హక్కులకు సంబంధించిన చట్టాలను విని యోగించుకోవాలని బెల్లంపల్లి మున్సిఫ్‌ మెజిస్ర్టేట్‌ కోర్టు న్యాయమూర్తి జి హిమబిందు పిలుపునిచ్చారు.

సదస్సులో మాట్లాడుతున్న బెల్లంపల్లి జూనియర్‌ సివిల్‌ జడ్జి హిమబిందు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  -  బెల్లంపల్లి మున్సిఫ్‌ మెజిస్ర్టేట్‌ హిమబింధు 

 బెల్లంపల్లి టౌన్‌, మార్చి 6: మహిళలు భయాన్ని వీడి వారి హక్కులకు సంబంధించిన చట్టాలను విని యోగించుకోవాలని బెల్లంపల్లి మున్సిఫ్‌ మెజిస్ర్టేట్‌ కోర్టు న్యాయమూర్తి జి హిమబిందు  పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాల యంలో నిర్వహించిన సదస్సులో మాట్లాడారు.   మహిళల పట్ల జరుగుతున్న ఆకృత్యాలను, ఈవ్‌టీ జింగ్‌లను, అత్యాచారాలను ఎదురించి చట్టాలను విని యోగించుకోవాలన్నారు. మండల న్యాయసేవా సం స్థకు ఫిర్యాదు చేసి మహిళలు న్యాయం పొందాలని కోరారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అంకెం శివ కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేష్‌, సీడీపీవో  ఉమాదేవి, న్యాయవాదులు సంగీత, అశోక్‌, కీర్తి బాల కృష్ణ, అనిల్‌కుమార్‌, చేను రవికుమార్‌ పాల్గొన్నారు. 

జన్నారం (దండేపల్లి): మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్య దర్శి రాజవేణు అన్నారు. దండేపల్లి మండల కేంద్రం లో అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని నిర్వహించి మహిళలను సన్మానించారు. ఆయన మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. జడ్పీ టీసీ నాగమణి, సుజాత, మనోరమ  పాల్గొన్నారు. 

ఏసీసీ: ఆడపిల్ల చదువు కుటుంబానికి వెలుగు అని ఏకలవ్య ఆశ్రమ అధ్యక్షుడు ఒడ్నాల లక్ష్మినారాయణ అన్నారు. శనివారం ఏకలవ్య ఆశ్రమంలో ప్రారంభమైన 5కే రన్‌ పలు ప్రాంతాల మీదుగా సాగింది. మున్సిపల్‌ కమిషనర్‌ స్వరూపరాణి, మహిళ, శిశుసంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల మాజీ కోఆర్డినేటర్‌ అత్తి సరోజ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘు నాథ్‌, ఆనంద్‌రావు, చందాకిరణ్‌ పాల్గొన్నారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో విశేష సేవలు అందించినం దుకు మున్సిపల్‌ కమిషనర్‌ స్వరూపారాణి, పారిశుధ్య కార్మికురాలు రహేజాన్‌ బాను, ప్రభుత్వాసుపత్రి స్వీప ర్‌ శీల, స్టాఫ్‌నర్స్‌ జ్యోతిలను సన్మానించారు.  రఘు నాథ్‌ మాట్లాడుతూ సేవా భారతి ఆధ్వర్యంలో 120 మంది యువకులకు ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్‌ కమిషనర్‌ మా ట్లాడుతూ సేవాభారతి ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించడం అభి నందనీయమన్నారు. 

Updated Date - 2021-03-07T03:47:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising