ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారోత్సవాలను ఘనంగా జరుపుకోవాలి

ABN, First Publish Date - 2021-10-15T06:36:59+05:30

అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ఎస్పీ రాజేశ్‌చంద్ర అన్నారు. ఈ నెల 15 నుంచి 21 వరకు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుగుతాయని తెలిపారు. వా రోత్సవాల సందర్భంగా గురువారం ఎస్పీ పోలీసు కార్యక్రమాల షెడ్యూలును విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌టౌన్‌, అక్టోబరు 14: అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ఎస్పీ రాజేశ్‌చంద్ర అన్నారు. ఈ నెల 15 నుంచి 21 వరకు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరుగుతాయని తెలిపారు. వా రోత్సవాల సందర్భంగా గురువారం ఎస్పీ పోలీసు కార్యక్రమాల షెడ్యూలును విడుదల చేశారు. 15న జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లు, హెడ్‌క్వార్టర్‌, డీఎస్పీ కార్యాలయంలో ఓపెన్‌హౌజ్‌ కార్యక్రమాలు చేపట్టాలని, విద్యార్థులు, ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగులను పోలీసు స్టేషన్‌కు ఆహ్వానించి తమ పని తీరుపై వివరించాలన్నారు. అదే విధంగా జాతి నిర్మాణంలో పోలీసుల పాత్ర పై, 16న వ్యాసరచన పోటీలు, 17న కానిస్టేబుల్‌ నుంచి ఎస్సైస్థాయి వరకు 3 క్యాటగిరిలో వ్యాసరచన పోటీలు ఉంటాయన్నారు. 21న జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా బహుమతుల ప్రదానం ఉంటుందని పేర్కొన్నారు. 18న అమరవీరుల కుటుంబాల సభ్యులతో సమావేశం ఉంటుందని వారి సమస్యలు అడిగి తెలుసుకుంటామన్నారు. 19న జిల్లాలోని పోలీసు స్టేషన్లలో రక్తదానం కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 

పోలీసు అమరవీరుల జ్ఞాపకార్థంలో కట్టడాలు..

పోలీసు అమరవీరుల జ్ఞాపకార్థం వారి పేర్లతో పోలీసు హెడ్‌క్వాటర్‌లో పలు భవనాలు, స్తూపం కట్టడాలు చేయడం జరిగిందని  ఎస్పీ రాజేశ్‌చంద్ర అన్నారు. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మావోయిస్టుల అలజడి, ఉగ్రవాదుల చర్యలు లేకుండా ప్రశాంత వాతావరణం నెలకొని ఉందంటే ఒక్కప్పటి పోలీసుల త్యాగాల ఫలితమే ప్రధాన కారణమన్నారు. ఒక్కప్పటి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అడవుల్లో నిరంతర మావోయిస్టులు, పోలీసుల మధ్య తరుచూ ఎదురుకాల్పులు, రక్తపు మరకలతో అట్టుడికి పోయేదని అన్నారు.

Updated Date - 2021-10-15T06:36:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising