ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరద బాధితులను ఆదుకుంటాం : మంత్రి

ABN, First Publish Date - 2021-07-25T05:58:13+05:30

వరదబాధితులను ఆదుకుంటామని దేవాదాయ, న్యాయ, అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శనివారం అన్నారు.

మొక్క నాటుతున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్ష్మణచాంద, జూలై 24 : వరదబాధితులను ఆదుకుంటామని దేవాదాయ, న్యాయ, అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శనివారం అన్నారు. మండలంలోని పీచర, ధర్మారం, చింతల్‌చాంద గ్రామాల్లో పర్య టించిన ఆయన నష్టపోయిన పంటలను పరిశీలించారు. చింతల్‌ చాందలో గోదావరి వరదకు కొట్టుకుపోయిన చేపల చెరువును 

పరిశీలించారు. రైతులతో మాట్లాడా రు. అధికారులు వచ్చి సర్వే చేస్తారని, పంటనష్టాన్ని అంచనా వేసి సర్కారుకు నివేదికలు సమర్పిస్తారని అన్నారు. బాధిత రైతులందరినీ ఆదుకోవటానికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేకచర్యలు తీసుకుంటున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ (కల్వకుంట్ల తారకరామారావు) బర్త్‌ డే సందర్భంగా ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ తలపెట్టిన ‘ముక్కోటి వృక్షార్చన’ కార్య క్రమంలో భాగంగా లక్ష్మణచాంద గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలచారి, నాయకులు అల్లోల సురేందర్‌రెడ్డి, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ రఘు నందన్‌రెడ్డి, ఎంపీపీ కేశం లక్ష్మీరమేష్‌, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్‌, తహసీల్దార్‌ కవితారెడ్డి, ఎంపీడీవో మోహన్‌, స్థానిక సర్పంచ్‌ బుర్రిలత, కుర్మ రాజేందర్‌రెడ్డి, రాజమణి, ప్రభాకర్‌ పాల్గొన్నారు. 

విజయడైరీతో ఉపాధి అవకాశాలు

నిర్మల్‌ కల్చరల్‌ : విజయడైరీ ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి అవ కాశాలు కల్పిస్తుందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం వరద బాధిత ప్రాంతాలు సందర్శించారు. ఆ ప్రాంత ప్రజలకు విజయడైరీ ఆధ్వర్యంలో పాలు, నీళ్లబాటిళ్లు ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో పంపిణీ చేశారు. 

Updated Date - 2021-07-25T05:58:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising