ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపుతాం

ABN, First Publish Date - 2021-10-26T03:29:18+05:30

జిల్లాలో గంజాయిసాగుపై ఉక్కుపాదం మోపుతామని ఎక్సైజ్‌ శాఖాధికారి రాజ్యలక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్‌శాఖ కార్యాలయంలో జిల్లాలోని ఎక్సైజ్‌ శాఖ అధికారులతో సోమవారం ఏర్పాటు చేసిన సమావే శంలో ఆమె మాట్లాడారు.

మాట్లాడుతున్న ఎక్సైజ్‌శాఖ అధికారి రాజ్యలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జిల్లా ఎక్సైజ్‌ శాఖాధికారి రాజ్యలక్ష్మి

ఆసిఫాబాద్‌రూరల్‌, అక్టోబరు 25: జిల్లాలో గంజాయిసాగుపై ఉక్కుపాదం మోపుతామని ఎక్సైజ్‌ శాఖాధికారి రాజ్యలక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్‌శాఖ కార్యాలయంలో జిల్లాలోని ఎక్సైజ్‌ శాఖ అధికారులతో సోమవారం ఏర్పాటు చేసిన సమావే శంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో గంజాయి నియం త్రణకు 8ప్రత్యేకబృందాలు ఏర్పాటు చేశామన్నారు. ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలోని ప్రతిగ్రామంలో గడపగడపకూ తనిఖీ చేపడుతామన్నారు. ఆసిఫా బాద్‌, జైనూరు, సిర్పూర్‌(యూ), కెరమెరి, వాంకిడి ప్రాంతాల్లో గంజాయి సాగు చేసినట్లు సమాచారం ఉందన్నారు. గంజాయి సాగుచేస్తే రైతుబంధు, రైతు బీమా పథకాలు రద్దు అవుతాయన్నారు. గంజాయి సాగు చేసిన వారితో పాటు ప్రోత్సహించిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి సాగు, రవాణాపై తమ94400902717 నంబర్‌కు సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు వారికి ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. సమావేశంలో ఎక్సైజ్‌ సీఐ మోసీన్‌అలీ, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-26T03:29:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising