ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంతిపూల వ్యాపారంపై వరుణుడి నీళ్లు

ABN, First Publish Date - 2021-10-18T06:24:53+05:30

మండల కేంద్రంలో శనివారం బతుకమ్మ పండుగ నిమజ్జనం నిర్వాహిస్తామని ముందస్తుగా ప్రకటించడంతో శనివారం ఖానాపూర్‌ కు పెద్దఎత్తున బంతిపూలు తరలివచ్చాయి. దీంతో ఉదయం కిలో బంతి పూలు రూ.70 నుంచి రూ.90 వరకు పలికాయి. కానీ పట్టణంలో శనివారం మధ్యాహ్నం నుంచి వర్షం జోరందుకోవడంతో బతుకమ్మ నిమజ్జనం వాయిదా పడింది. రాత్రి వరకు వర్షం కురవడంతో పూలను

ఖానాపూర్‌ శివారులో తర్లాపాడ్‌ వద్ద రోడ్డు పక్కన ఇలా..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బతుకమ్మ నిమజ్జనం ముందస్తు ప్రకటనతో ఖానాపూర్‌కు తరలివచ్చిన బంతిపూల వ్యాపారులు 

వర్షం కురవడంతో వాయిదా

పూలు కొనేవారు లేకపోవడంతో పట్టణ శివారులో వదిలి వెళ్లిన వైనం 

బంతిపూల కోసం ఎగబడ్డ స్థానికులు

ఖానాపూర్‌, అక్టోబర్‌ 17: మండల కేంద్రంలో శనివారం బతుకమ్మ పండుగ నిమజ్జనం నిర్వాహిస్తామని ముందస్తుగా ప్రకటించడంతో శనివారం ఖానాపూర్‌ కు పెద్దఎత్తున బంతిపూలు తరలివచ్చాయి. దీంతో ఉదయం కిలో బంతి పూలు రూ.70 నుంచి రూ.90 వరకు పలికాయి. కానీ పట్టణంలో శనివారం మధ్యాహ్నం నుంచి వర్షం జోరందుకోవడంతో బతుకమ్మ నిమజ్జనం వాయిదా పడింది. రాత్రి వరకు వర్షం కురవడంతో పూలను కొనేవారే కరువయ్యారు. సాయంత్రం రూ.20 కిలోకే విక్రయించినా ఎవరు కొనకపోవడంతో పట్టణ శివారు ప్రాంతాల్లో రోడ్డు పక్కన పూలను వదిలిపెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా, తర్లాపాడ్‌ శివారులో రోడ్డు పక్కన పెద్దఎత్తున బంతిపూలను చూసిన జనం వాటి కోసం ఎగబడ్డారు.  తర్లాపాడ్‌లోనూ సోమవారం బతుకమ్మ నిర్వహించనున్నారు. 

ఫ నేడు ఖానాపూర్‌లో బతుకమ్మ నిమజ్జనం

ఖానాపూర్‌లో సోమవారం బతుకమ్మ నిమజ్జనం నిర్వహించనున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం భారీ వర్షం కారణంగా బతుకమ్మ నిమజ్జనం వాయిదా పడిన నేపథ్యంలో హిందూ ఉత్సవ సమితి, ఖానాపూర్‌, తిమ్మాపూర్‌ వీడీసీలు ఆదివారం పట్టణంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం బతుకమ్మ నిమజ్జనం నిర్వహించాలని నిర్ణయించినట్లు మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌ పేర్కొన్నారు. మహిళల సౌకర్యార్థం బతుకమ్మ నిమజ్జనం కోసం మున్సిపల్‌ ఆద్వర్యంలో అన్నీ ఏర్పాట్లను చేస్తున్నామని రాజేందర్‌ తెలిపారు.

నిర్మల్‌ కల్చరల్‌: జిల్లా కేంద్రంలో బతుకమ్మ వేడుకలు ఆదివారం ముగి శాయి. ఇందిరానగర్‌ కాలనీకి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో హజరై బతు కమ్మ ఆడారు. బతుకమ్మలను అం దంగా తీరొక్క పూలతో పేర్చి బతుకమ్మ పాట లు పాడుతూ కోలాటాలు వేశారు. జెబి. సునంది అపార్ట్‌మెంట్‌లోను, పట్టణాఽ ద్యక్షుడు మారుగొండ రాము నివాసంలో బతుకమ్మ ఆడారు. టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు పాకాల రాంచందర్‌, భూషణ్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-18T06:24:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising