ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెజ్జూరు మండలంలో రెండు పులుల సంచారం

ABN, First Publish Date - 2021-02-26T03:41:35+05:30

బెజ్జూరు మండలం కుంటలమానేపల్లి గ్రామ సమీపం లోని అటవీ ప్రాంతంలో గురువారం రెండు పెద్ద పులులు సంచరించడంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

పులిదాడిలో గాయపడ్డ ఆవు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-పశువుల మందపై దాడి

-రెండు ఆవులకు గాయాలు

బెజ్జూరు, ఫిబ్రవరి25: బెజ్జూరు మండలం కుంటలమానేపల్లి గ్రామ సమీపం లోని అటవీ ప్రాంతంలో గురువారం రెండు పెద్ద పులులు సంచరించడంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కుంటల మానేపల్లికి చెందిన ముగ్గురు పశువుల కాపర్లు పశువులను మేతకు తీసుకెళ్లి తిరిగి వస్తుండగా సాయంత్రం గ్రామ సమీపంలో పశువుల మందపై ఒక పులి దాడి చేయడంతో రెండు ఆవులకు గాయాలయ్యాయి. బ్రహ్మాజీ అనే వ్యక్తి సలుగుపల్లి వార సంత నుంచి ఆటోలో ప్రయాణికులను కుంటలమానేపల్లికి తీసుకువెళ్తుండగా గ్రామ సమీపంలోని పత్తి చేనులో రెండు పులులు కనిపించాయి. దీంతో ఆటోలు ఉన్న ప్రయాణికులు పెద్దగా కేకలు వేయడంతో పులులు సమీప అటవీ ప్రాంతంలోని వెళ్లినట్లు వారు పేర్కొన్నారు. అటవీ అధికారులు శ్రీకాంత్‌, మనోహర్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి గ్రామస్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

Updated Date - 2021-02-26T03:41:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising