ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ పథకాలను ఆదివాసీలు సద్వినియోగపర్చుకోవాలి

ABN, First Publish Date - 2021-04-10T06:47:16+05:30

ఆదివాసి గిరిజన తెగల కోసం ప్రభుత్వం మంజూరు చేసే సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని జిల్లా గిరిజన అధికారి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

ఉరులమర్రి స్థూపం వద్ద నివాళులు అర్పిస్తున్న జిల్లా గిరిజన అధికారి శ్రీనివాస్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా గిరిజన అధికారి శ్రీనివాస్‌రెడ్డి  

ఘనంగా ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో రాంజీగోండు వర్ధంతి 

నిర్మల్‌ టౌన్‌, ఏప్రిల్‌ 9 : ఆదివాసి గిరిజన తెగల కోసం ప్రభుత్వం మంజూరు చేసే సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని జిల్లా గిరిజన అధికారి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివాసీ సంఘాల ఆధ్వర్యం లో శుక్రవారం రాంజీగోండు ఉరితీసిన ఉరులమర్రి స్థూపం, విగ్రహాలకు ఘనంగా నివాళులు అర్పించి, 161వ వర్థంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ ఆదివాసీ తెగల అభివృద్ధి కోస మే ప్రభుత్వం ప్రత్యేక పథకాలను మంజూరు చే స్తుందని, ప్రభు త్వం మీకోసం ఆశ్రమ పాఠశాలలో నిర్వహిస్తున్న వాటిని ప్రతి ఆదివాసీ బిడ్డ విని యోగించుకోవాలని అన్నారు. తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు భూమయ్య మాట్లాడుతూ ఆదివాిసీ గిరిజన తెగల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేందుకు మ్యూజియం ఏర్పాటు చేయాలన్నారు. రామ్‌ విగ్రహం చుట్టూ కంచె ఏర్పాటు చేసి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంద న్నారు. ఈ కార్యక్రమంలో నాయక్‌పోడ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు మొసలి చిన్నయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు సాకి లక్ష్మణ్‌, నాయక్‌పోడ్‌ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శివశంకర్‌, సర్పంచ్‌ ఎస్‌. సాయన్న, జిల్లా కార్యదర్శి సుంకరి సాయన్న, జిల్లా నాయకులు గోవిందుల మహేష్‌, రమేష్‌, ముచ్చిండ్ల సాయి, భీమన్న, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-10T06:47:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising