ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పస్కరాజుల్‌ దేవతకు గిరిజనుల పూజలు

ABN, First Publish Date - 2021-06-21T06:55:35+05:30

మండలంలోని లఖంపూర్‌ గ్రామానికి చెందిన గిరిజనులు ఆదివారం పస్కరాజుల్‌ దేవతకు సంప్రదాయబద్ధంగా పూజ లు చేశారు. గ్రామ పొలిమేరల్లోని పస్కరాజుల్‌ దేవతకు పూజలు చేసి నైవేద్యాలను సమర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేరడిగొండ, జూన్‌ 20: మండలంలోని లఖంపూర్‌ గ్రామానికి చెందిన గిరిజనులు ఆదివారం పస్కరాజుల్‌ దేవతకు సంప్రదాయబద్ధంగా పూజ లు చేశారు. గ్రామ పొలిమేరల్లోని పస్కరాజుల్‌ దేవతకు పూజలు చేసి నైవేద్యాలను సమర్పించారు. గ్రామంలో గల పశువులకు రోగాలు రాకుండా ఉండడమే కాకుండా వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి, పంటలు పండుతాయని వారి విశ్వాసం. ఏటా మార్గశిర కార్తె చివర ఈ పస్క రాజుల్‌ దేవతకు పూజలు చేయడం గిరిజనుల ఆనవాయితీ. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు సుంగు పటేల్‌, మాడావి రాజు, ఆత్రం లక్ష్మణ్‌, మాడావి శేష్‌రావ్‌, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు. 

తాంసిలో ‘భీమన్న’కు పూజలు

తాంసి, జూన్‌ 20: మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం భీమ న్న దేవునికి ఘనంగా పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మేళతా ళాల మధ్య మహిళలు మంగళహారతులు ఊరేగింపుగా వెళ్లి నైవేద్యం సమర్పించారు. అనంతరం మేకలను బలిదానం చేశారు. ఈ పండుగను పురస్కరించుకుని వారి ఆడపడుచులు గ్రామానికి రావడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. 

నిపానిలో పోచమ్మకు..

భీంపూర్‌: మండలంలోని నిపాని గ్రామంలో ప్రతీ ఆదివారం గ్రామస్థులు పోచమ్మ పూజలు చేస్తున్నారు. అందులో భాగంగానే గ్రామంలోని ఒక వాడ వారు పోచమ్మ తల్లికి అభిషేకాలు చేసి బోనాలు సమర్పించారు. ఈ పూజలతో సర్పంచ్‌ భూమన్న దోర, గ్రామ పెద్దలు మార్చెట్టి అనిల్‌, రాజన్న, నాగయ్య, రాంరెడ్డి తదితరులున్నారు.

Updated Date - 2021-06-21T06:55:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising