ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదివాసీ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి

ABN, First Publish Date - 2021-06-15T05:45:02+05:30

ఆదివాసీ గిరిజన మహిళలను అన్ని రంగాల్లో ముందుండాలని, వారి జీవితాల్లో వెలుగులు రావా లని, ముఖ్యంగా ప్రతీఒక్కరూ చదువుకు ప్రాధాన్యతనివ్వాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి అన్నారు.

కొలాంగూడాలో పర్యటిస్తున్న మహిళా కమిషన్‌ సభ్యురాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదివాసీ పిల్లలను చదివించాలి

రుతుక్రమం సమయంలో ఉండేందుకు ప్రత్యేక షెడ్ల నిర్మాణం 

రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు ఈశ్వరీబాయి

ఖానాపూర్‌ రూరల్‌, జూన్‌ 14 : ఆదివాసీ గిరిజన మహిళలను అన్ని రంగాల్లో ముందుండాలని, వారి జీవితాల్లో వెలుగులు రావా లని, ముఖ్యంగా ప్రతీఒక్కరూ చదువుకు ప్రాధాన్యతనివ్వాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి అన్నారు. ఖానాపూర్‌ మండలంలోని మారుమూల గిరిజన గ్రామం కొలాంగూడ (ఎర్వచింతల్‌) గ్రామాన్ని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా గిరిజనులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో పర్యటించి సమస్య లు అడిగి తెలుసుకున్నారు. గిరిజన మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తేనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని, ఆదివాసీ పిల్లలు చదువులో ఇప్పటికి వెనుకబడి ఉన్నారని అన్నా రు. వారు చదువుకుంటేనే జీవితాల్లో వెలుగులు నిండుతాయ న్నారు. కొలాం మహిళలు నెలసరి రుతుక్రమం సమయంలో గ్రామం బయట దూరంగా గుడిసెలో ఉండడం వలన ప్రమాదా లకు గురి అవుతున్నారని, అయితే వారి కోసం రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ భవనాలకు ఆనుకొని మహిళల కోసమే ప్రత్యేక షెడ్లు నిర్మించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ విషయం మహిళాభివృద్ధి సంక్షేమ కమిషనర్‌తో చర్చించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఆదివాసీ మహిళల అభివృద్ధికి మరింతగా పాటుపడుతానన్నారు. కార్య క్రమంలో టీఆర్‌ఎస్‌ జిల్లా మహిళా నాయకులు జాదవ్‌ సుమన్‌బాయి, కొలాంగూడ సర్పం చ్‌ గంగమణి, స్థానికులు భీంరావ్‌, ఆత్రం రాము, సీడం చిన్ను తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-15T05:45:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising