ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ధరణి’తో పారదర్శకంగా రిజిస్ట్రేషన్‌

ABN, First Publish Date - 2021-10-30T03:59:48+05:30

ధరణి పోర్టల్‌ ద్వారా పారదర్శకతతో కూడిన రిజిస్ట్రేషన్‌ సాధ్యమవుతుందని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ ప్రారంభించి ఏడాది పూరైన సందర్భంగా కలెక్టరేట్‌ కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ రాజేశంతో కలిసి శుక్రవారం కేక్‌ కట్‌ చేశారు.

కేక్‌ కట్‌ చేస్తున్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ 

ఆసిఫాబాద్‌, అక్టోబరు 29: ధరణి పోర్టల్‌ ద్వారా  పారదర్శకతతో కూడిన రిజిస్ట్రేషన్‌ సాధ్యమవుతుందని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ ప్రారంభించి ఏడాది పూరైన సందర్భంగా కలెక్టరేట్‌ కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ రాజేశంతో కలిసి శుక్రవారం కేక్‌ కట్‌ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ధరణి పోర్టల్‌ ద్వారా 98 శాతం వ్యవసాయ భూముల సమస్యలు పరిష్కరించామని అన్నారు. దీనిలో మోత్తం 31 ఆప్షన్స్‌ ఉన్నాయని చెప్పారు. మరో పది మాడల్స్‌ అందుబాటులో ఉన్నాయన్నారు. ధరణి ద్వారా ప్రజావాణికి వచ్చే వారి సంఖ్య తగ్గిందని తెలిపారు. జిల్లాలో పెండింగ్‌ మ్యూటేషన్‌ దరఖాస్తులు 1,678 రాగా 1,666 పూర్తి చేశామన్నారు. అలాగే భూ తగాదాలకు సంబంధించి 2,217 రాగా 2171 పూర్తి చేశామని చెప్పారు. ప్రోహి బిటెడ్‌ కేసులు 646 ఉండగా ఇప్పటి వరకు 627 పూర్తి చేశామని వివరించామని కోర్టు కేసులు 25 విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఎస్‌పీఎంకు సంబంధించి నాలుగు కేసులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేశామని చెప్పారు. జిల్లాలో 142 ఆధార్‌ సీడింగ్‌ పెండింగ్‌లో ఉండగా 136 పూర్తి చేశామన్నారు. వీటితో పాటు ఎన్‌ఆర్‌ఐకి సంబంధించి ఒక కేసు, సెమి అర్చబర్‌ ల్యాండ్‌ 2, ఎగ్జిక్యూటీవ్‌ జీపీ ఒకటి పూర్తి చేశామన్నారు. విస్తీర్ణంకు సంబంధించిన తప్పుల సవరణ ఆప్షన్‌ రావాల్సి ఉందని చెప్పారు.  అది కూడా వస్త మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే సరిపోతుం దన్నారు. అంతకు ముందు అదనపు కలెక్టర్‌ రాజేశం మాట్లాడుతూ ఏదైనా కొత్త పని చేసినప్పుడు కొన్ని అవాంతరాలు ఉంటాయని ధరణిలో ఏర్పడిన అవాంతరాలను ఎదుర్కొని విజయం దిశగా దూసుకు పోతోందని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌వో సురేష్‌, తహసీల్దార్‌ ఏజాజ్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-30T03:59:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising