ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దు - మరికొన్ని దారి మళ్లింపు

ABN, First Publish Date - 2021-10-31T14:24:03+05:30

సికింద్రాబాద్‌ డివిజన్‌లోని ఖాజీపేట-బల్హార్షా మధ్య రైల్వేలైనుకు మరమ్మతు చేపడుతున్న కారణంగా అటువైపు వెళ్లే పలు రైళ్లు రద్దు కాగా, మరికొన్నింటిని దారి మళ్లించినట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. ఆ వివరాలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై(Tamilnadu): సికింద్రాబాద్‌ డివిజన్‌లోని ఖాజీపేట-బల్హార్షా మధ్య రైల్వేలైనుకు మరమ్మతు చేపడుతున్న కారణంగా అటువైపు వెళ్లే పలు రైళ్లు రద్దు కాగా, మరికొన్నింటిని దారి మళ్లించినట్లు దక్షిణరైల్వే ప్రకటించింది. ఆ వివరాలు...


పూర్తిగా రద్దయిన రైళ్లు:

నవంబర్‌ 1, 8 తేదీల్లో బయలుదేరే బరౌనీ - ఎర్నాకులం (02521)

నవంబర్‌ 5, 12 తేదీల్లో బయలుదేరే ఎర్నాకులం - బరౌనీ (02522)


దారి మళ్లించిన రైళ్లు:

- నవంబర్‌ 8వ తేదీన బయలుదేరే శ్రీమాతా వైష్ణో దేవి కాట్రా - కన్నియాకుమారి (06318) స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ నాగపూర్‌ - రాజ్‌గన్పూర్‌ - తిట్లఘర్‌ - విజయనగరం - దువ్వాడ - విజయవాడ మీదుగా వస్తుంది. ఈ రైలు సేవాగ్రం, చంద్రపూర్‌, బల్హార్షా, రామగుండం, వరంగల్‌, ఖమ్మం స్టేషన్లకు వెళ్లదు.

- నవంబర్‌ 3, 6, 10, 13 తేదీల్లో బయలుదేరే కొర్బా - కొచ్చువేలి (02647) స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ బిలాస్‌పూర్‌ - తిట్లఘర్‌ - విజయనగరం - దువ్వాడ - విజయవాడ మీదుగా వస్తుంది. ఈ రైలు తుమ్సర్‌రోడ్‌, భండారా రోడ్‌, నాగపూర్‌, సేవాగ్రం, చంద్రపూర్‌, బల్హార్షా, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, మంచిర్యాల, రామగుండం, వరంగల్‌, ఖమ్మం స్టేషన్లకు వెళ్లదు.

- నవంబర్‌ 1, 4, 8, 11 తేదీల్లో బయలుదేరే కొచ్చువేలి - కొర్బా (02648) స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ విజయవాడ - దువ్వాడ - విజయనగరం - తిట్లఘర్‌ - బిలాస్‌పూర్‌ స్టేషన్ల మీదుగా వెళ్తుంది. ఈ రైలు ఖమ్మం, వరంగల్‌, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, బల్హార్షా, చంద్రపూర్‌, సేవాగ్రం, నగ్‌పూర్‌, భండారారోడ్‌, తుమ్సర్‌రోడ్‌ స్టేషన్లకు వెళ్లదు.

- నవంబర్‌ 1వ తేదీన బయలుదేరే హజ్రత్‌ నిజాముద్దీన్‌ - చెన్నై సెంట్రల్‌ (06152) స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ నాగ్‌పూర్‌ - తిట్లఘర్‌ - విజయనగరం- దువ్వాడ-విజయవాడ మీదుగా వస్తుంది. ఈ రైలు బల్హార్షా స్టేషన్‌ వెళ్లదు.

- నవంబర్‌ 1, 8 తేదీల్లో బయలుదేరే ఇండోర్‌ - కొచ్చువేలి (02645) స్పెషల్‌ రైలు మజ్రి - పింపల్‌ఖుటి - ముద్‌ఖేడ్‌- నిజామాబాద్‌ - సికిం ద్రాబాద్‌ - పగిడిపల్లి - తెనాలి స్టేషన్ల మీదుగా వస్తుంది. ఈ రైలు చంద్రపూర్‌, బల్హార్షా, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, బెల్లంపల్లి, మంచిర్యాల, రామ గుండం, వరంగల్‌, ఖమ్మం, విజయవాడ స్టేషన్లకు వెళ్లదు.

- నవంబర్‌ 6, 13 తేదీల్లో బయలుదేరే కొచ్చువేలి - ఇండోర్‌ (02646) స్పెషల్‌ రైలుతెనాలి - పగిడిపల్లి - సికింద్రాబాద్‌- నిజామాబాద్‌- ముద్‌ ఖేద్‌-పింపల్‌ఖుటి-మజ్రి స్టేషన్ల మీదుగా వెళ్తుంది. ఈ రైలు విజయవాడ, ఖమ్మం, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, బల్హార్షా, చంద్రపూర్‌ స్టేషన్లకు వెళ్లదు.

Updated Date - 2021-10-31T14:24:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising