ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడే విజయ దశమి

ABN, First Publish Date - 2021-10-15T06:35:05+05:30

‘చెడు’పై ‘మంచి’ సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే వేడుకే విజయదశమి. శుక్రవారం దసరా సంబరాలను ఘనంగా జరుపుకొనేం దుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. శమీ, ఆయుధ పూజలు, రావణదహనాలు, విందు వినోదాలతో రోజంతా సరదాగా గడపనున్నారు.

దసరా వేడుకలకు ముస్తాబైన దసరా మైదానం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్ధమైన దసరా మైదానం 

ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్‌ చైర్మన్‌

రావణ దహనం చేయనున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు

ఆదిలాబాద్‌టౌన్‌, అక్టోబరు 15: ‘చెడు’పై ‘మంచి’ సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే వేడుకే విజయదశమి. శుక్రవారం దసరా సంబరాలను ఘనంగా జరుపుకొనేం దుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. శమీ, ఆయుధ పూజలు, రావణదహనాలు, విందు వినోదాలతో రోజంతా సరదాగా గడపనున్నారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూనే వేడుకలు నిర్వహించుకునేందుకు సిద్ధమయ్యారు. జిల్లా కేంద్రంలోని దస్నాపూర్‌ దసరా మైదానంలో యేటా నిర్వహించే రావణ దహనం కార్యక్రమానికి మైదానాన్ని అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. ఈ ఏర్పాట్లను మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పరిశీలించారు. కాగా, హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి దసరా మైదానం వరకు భక్తులు  ప్రత్యేక శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌, ఎస్పీ రాజేశ్‌చంద్రలతో పాటు ఎమ్మెల్యే జోగు రామన్న, మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌లు పాల్గొని వేడుకలను ప్రారంభించనున్నారు. ఈ వేడుకలకు పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చి తిలకించనున్నారు.

శమీపూజ, పాలపిట్ట దర్శనం

విజయదశిమి రోజు కొత్త బట్టలు ధరించి కుటుంబ సభ్యులందరూ కలిసి ఊరి మధ్య ఏర్పాటు చేసిన శమీవృక్షం కింద ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం జమ్మి ఆకులను పెద్దలకు ఇచ్చి, ఆశీర్వాదం పొందుతారు. పాలపిట్ట దర్శనం చేసుకొని బంధువులు, స్నేహితులకు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటారు. సాయంత్రంవేళ రావణ దహనాలు కొనసాగుతాయి. దసరారోజు పాలపిట్ట దర్శనాన్ని శుభసూ చికగా భావిస్తారు. ముఖ్యమైన పనికి వెళ్లే ముందు పాలపిట్టను దర్శిస్తే విజయం వరిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. 

Updated Date - 2021-10-15T06:35:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising