ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కట్టడి కఠినం!

ABN, First Publish Date - 2021-04-24T03:34:29+05:30

జిల్లాలో కరోనా సెకండ్‌వేవ్‌ వేగంగా విస్తరిస్తోంది. ప్రభుత్వం కఠిన ని బంధనలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు కట్టుది ట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తూ జిల్లాకేంద్రంతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ తనిఖీలు చేస్తున్నారు.

వాహనదారులకు జరిమానా విధిస్తున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాలో పకడ్బందీగా కరోనా కట్టడికి చర్యలు 

23 రోజుల్లో 4 వేల 17 కేసులు

పగలంతా తనిఖీలు.. రాత్రి కర్ఫ్యూ


ఆదిలాబాద్‌, ఏప్రిల్‌ 23, (ఆంధ్రజ్యోతి)/ఉట్నూర్‌: జిల్లాలో కరోనా సెకండ్‌వేవ్‌ వేగంగా విస్తరిస్తోంది. ప్రభుత్వం కఠిన ని బంధనలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు కట్టుది ట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తూ జిల్లాకేంద్రంతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ తనిఖీలు చేస్తున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి మాస్కు ధరించని వారిపై ప్రత్యేక నిఘాను సారిస్తున్నా రు. ప్రతీఒక్కరు మాస్కు ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్‌ 82ను విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. విపత్తుల నిర్వహణ చ ట్టంలోని 51 నుంచి 60 వరకు గల సెక్షన్లు, 188 ఐపీసీ సెక్షన్‌ కింద కే సులు నమోదు చేస్తూ జరిమానాలు విధిస్తున్నారు. జిల్లాలో రోజుకూ 400 నుంచి 500 వరకు కేసులు నమోదవుతున్నాయి. 23 రోజుల్లోనే 4017 కేసులు నమోదైనట్లు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నా రు. అయినా కొందరు నిర్లక్ష్యంగానే బయటకు రావడంతో వైరస్‌ ఉధృత్తి మరింత పెరుగుతోంది. పోలీసులు కేసులు నమోదు చేస్తూ వదిలేయ డం కన్నా ప్రజల్లో మరింత బాధ్యత పెంచేలా చర్యలు తీసుకుంటేనే ఫ లితాలు వస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

రూ.25.32 లక్షల జరిమానా..

మాస్కు ధరించని వారిపై జిల్లావ్యాప్తంగా 4017 కేసులు నమోదు చేశారు. ఇందులో 2532 కేసులను నమోదు చేసి ఈ-చలాన్‌ ద్వారా రూ.25 లక్షల 32వేల జరిమానాలు విధించారు. మిగితా 1485 కేసులు నమోదు చేసి కోర్టుకు పంపించారు. ఈ కేసులపై జరిమానా, శిక్ష విధింపుపై కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ-చలాన్‌ ద్వారా విధించిన జరిమానాలను మూడు నెలల గడువులోగా వాహనదారులు చెల్లించాల్సి ఉంది. అలాగే మూడుసార్లు నిబంధనలు అతిక్రమించిన వారికి నోటిసులు జారీ చేసి కోర్టు ముందు హాజరుపరుస్తారు. త్రిబుల్‌రైడర్‌, హెల్మెట్‌, మాస్కులు ధరించని వారిపై వేరు వేరుగా జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ప్రజలు నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించక తప్పదంటున్నారు.

జిల్లా అంతటా ప్రత్యేక డ్రైవ్‌..

కరోనా వైరస్‌ ఉధృతి నేపథ్యంలో జిల్లా అంతటా పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. పట్టణ ప్రాంతంతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో తనిఖీలు చేస్తున్నారు. మాస్కులు ధరించని వారిపై చట్టరీ త్యా చర్యలు తీసుకుంటున్నారు. రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వ రకు కర్ఫ్యూను విధిస్తున్నారు. రాత్రి 8 గంటల వరకే వ్యాపారులు, వా హనదారులు ఇంటికి చేరుకుంటున్నారు. 9 గంటల తర్వాత జిల్లాకేం ద్రంలోని ప్రధానదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సరుకుల రవాణా, అత్యవసర పనుల నిమిత్తమే ప్రజలు బయటకు వస్తున్నారు. జిల్లావ్యాప్తంగా కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేయడంతో వైరస్‌ కట్ట డి అవుతుందని భావిస్తున్నారు. 

పదుల సంఖ్యలో మృతులు 

ఉట్నూర్‌ ప్రాంతంలో వారం రోజుల్లో కరోనాబారిన పడి పదుల సంఖ్యలో మృత్యువాత పడగా, 231 మందికి వైరస్‌ సోకింది. దం తన్‌పల్లి, హస్నాపూర్‌, శ్యాంపూర్‌ పీహెచ్‌సీలతో పాటు ఉ ట్నూర్‌ సివిల్‌ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఈ నెల 17న 16 మందికి, 18న 31 మందికి, 19న 22 మం దికి, 20న 32 మందికి, 21న 36 మందికి, 22న 66 మందికి, 23న 29 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వై ద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 

ఆర్టీసీ బస్సుల్లో కనిపించని భద్రత 

వైరస్‌ కట్టడి కోసం ఆర్టీసీ బస్సుల్లో భద్రత కనిపించడం లేదు. లాక్‌డౌన్‌ తర్వాత ఆర్టీసీ బస్సులను శానిటైజర్లు చేసి ప్రతీ ప్రయాణికుడు బస్సు ఎక్కిన తర్వాత శానిటైజర్లు వేసేవారు. ప్రస్తుతం ప్రయా ణికులు భౌతికదూరం పాటించకపోవడంతో వైరస్‌ వేగంగా ప్రబలుతోంది. 

వ్యాపారసంస్థల్లో కనబడని భౌతిక దూరం

వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, పంచాయతీ అధికారులు, పోలీసు అధికారులు భౌతిక దూరం పాటించాలని, మాస్కులు పెట్టుకోవాలని అవగాహన కల్పిస్తున్నా వ్యాపారులు మాత్రం అధికారుల సూచనలు, సలహాలు పట్టించుకోవడం లేదు. వ్యాపార సంస్థలతో పాటు కూరగా యల దుకాణాల వద్ద, మటన్‌ షాపుల వద్ద, చికెన్‌ సెంటర్ల వద్ద, వైన్స్‌ షాపుల వద్ద, బెల్టుషాపుల వద్ద భౌతికదూరం పాటించకుండానే, మా స్కులు సైతం కొందరు పెట్టుకోవడం లేదు. 

మాస్కు ధరించే బయటకు రావాలి

ఎం.రాజేశ్‌చంద్ర (ఇన్‌చార్జి ఎస్పీ, ఆదిలాబాద్‌)

వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో అందరూ తప్పనిస రిగా మాస్కులు ధరించే బయటకు రావాలి. జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, ఇ తర పని ప్రదేశాలు, ప్రయాణ ప్రాంగణాలలో ప్రతీ ఒక్కరు మాస్కు ధరించేలా చర్యలు తీసుకుంటు న్నాం. కొవిడ్‌ నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఆ దేశాలను కఠినంగా అమలు చేస్తున్నాం. జిల్లాలోని అన్ని పోలీసు స్టేష న్ల పరిధిలో విపత్తు నిర్వహణ చట్టాన్ని అమలు చేస్తున్నాం. 

Updated Date - 2021-04-24T03:34:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising