ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘బృహత్‌ పల్లె ప్రకృతి వనం’ పనులు త్వరగా పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2021-07-30T04:15:35+05:30

బృహత్‌ పల్లె ప్రకృతి వనం పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. గురువారం మండల కేంద్రంలో పది ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న స్థలాన్ని పరిశీ లించి అధికారులకు పలు సూచనలు చేశారు. హరిత తెలంగాణలో భాగంగా అటవీ సంపదను పెంపొందిం చేందుకు పల్లె ప్రకృతి వనాలు దోహదపడతాయ న్నారు. నాటే మొక్కలు, రకాలను తెలుసుకున్న ఆమె సీమచింత రకం మొక్కలపై ఆసక్తి కనబర్చారు.

మొక్కలను పరిశీలిస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కోటపల్లి, జూలై 29: బృహత్‌ పల్లె ప్రకృతి వనం పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. గురువారం మండల కేంద్రంలో  పది ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న స్థలాన్ని పరిశీ లించి అధికారులకు పలు సూచనలు చేశారు. హరిత తెలంగాణలో భాగంగా అటవీ సంపదను పెంపొందిం చేందుకు పల్లె ప్రకృతి వనాలు దోహదపడతాయ న్నారు. నాటే మొక్కలు, రకాలను తెలుసుకున్న ఆమె సీమచింత రకం మొక్కలపై ఆసక్తి కనబర్చారు. సీమ చింత మొక్కలు కర్ణాటకలో బాగా ఉంటాయని, వీటి కాయలు ప్రజలకు ఉపయో గపడతాయన్నారు. ప్రజలకు ఉపయోగపడే జామ, దాని మ్మ, ఉసిరి,  సీతాఫలం, నేరే డు, పారిజాతం, కరివేప, తది తర 31 వేల మొక్కలను నాటి సంరక్షించాలన్నారు. వనం చుట్టూ బయోఫెన్సింగ్‌ను ఏర్పాటు చేయాలని, మెయిన్‌గేట్‌, వాకింగ్‌ట్రాక్‌, ఆట స్థలం ఉండేలా చూడాలని సూచించారు. కలెక్టర్‌ మొక్క నాటి నీరు పోశారు. సూపరింటెండెంట్‌ లక్ష్మయ్య, ఏపీవో వెంక టేశ్వర్‌, కార్యదర్శి రవళి, నాయకులు మంత్రి రామయ్య,  స్వామి, ఉపాధిహామీ టీఏ చిరంజీవి పాల్గొన్నారు. 

మల్లంపేటలో డంపింగ్‌యార్డు వద్ద శునకం కళేబరం ఉండి దుర్గంధం రావడంతో కలెక్టర్‌ అధికా రుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించిన ఆమె గడ్డిని తొలగించాలని, రోడ్ల కిరువైపులా మొక్కలు నాటాలన్నారు. ఎంపీడీవో, ఎంపీవో, సర్పంచు అందుబాటులో లేకపోగా కార్యదర్శి సాగర్‌పై కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. 

 పీహెచ్‌సీని పరిశీలించిన కలెక్టర్‌ 

జైపూర్‌: కుందారం పీహెచ్‌సీని కలెక్టర్‌ భారతి హోళికేరి సందర్శించారు. పీహెచ్‌సీలో సమస్యలపై వైద్యురాలు నీరజను అడిగి తెలుసుకున్నారు. భవనం శిథిలావస్థకు చేరుకుందని, ప్రజలు రావడానికి భయప డుతున్నారని కలెక్టర్‌కు వివరించారు. కుందారం పీహెచ్‌సీ నూతన భవనం నిర్మాణానికి అధికారులకు నివేదికలు అందించాలని కలెక్టర్‌ సూచించారు. అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలని, మెరు గైన వైద్య సేవలందించాలని కలెక్టర్‌ సూచించారు.  జిల్లా వైద్యాధికారి సుబ్బారాయుడు ఉన్నారు. 


Updated Date - 2021-07-30T04:15:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising