ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంగరంగ వైభవంగా అమ్మవారి కల్యాణం

ABN, First Publish Date - 2021-03-07T05:28:17+05:30

మండల కేంద్రంలోని ముత్యాలపోచమ్మ ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి.

ముత్యాలపోచమ్మ దేశపతిరాజుల శాంతికల్యాణం నిర్వహిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖానాపూర్‌, మార్చి 6 : మండల కేంద్రంలోని ముత్యాలపోచమ్మ ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఈ వేడుకల్లో బాగంగా శనివారం ఆలయ ఆవరణలో అమ్మవారికల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ముత్యాలపోచమ్మ, దేశపతిరాజుల శాంతి కల్యాణ ఘట్టాన్ని ఛండి ఉపాసకులు, హైదరాబాద్‌కు చెందిన పాలెం మనోహరశర్మ, వేదపండితులు చక్రపాణి వాసుదేవాచార్యులు, ఆలయఅర్చకులు శరత్‌చంద్రల వేద మంత్రోచ్చణల మఽధ్య ఘనంగా జరిగింది. ఈ కళ్యాణ ఘట్టాన్ని వీక్షించేందుకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుండే కాకుండా జగిత్యాల, కరీంనగర్‌ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు. మున్సిపల్‌ చైర్మన్‌ అంకంరాజేందర్‌ అనూషా దంపతుల ఇంటి నుండి అమ్మవారికి ఓడిబియ్యం, తలంబ్రాలను ఎదు ర్కోలుగా తీసుకొచ్చారు. శుక్రవారం రాత్రి అమ్మవారి ఆభరణాల ఊరేగింపును భక్తులు అట్టహాసంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి శోభాయాత్రలో పాల్గొన్నారు. అమ్మవారి ఆభరణాల ఊరేగింపు సందర్భంగా నిర్వహించిన పోతురాజుల విన్యాసం ఆకట్టుకుంది. టీజివో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అజ్మీరా శ్యాంనాయక్‌ అమ్మవారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయకమిటి అఽధ్యక్షులు అంకం రాజేందర్‌, ఉపాఽధ్యక్షులు నాగేందర్‌ ఆద్వర్యంలో భక్తులకు ఆలయకమిటి బృందం ఏర్పాట్లను పర్యవేక్షించారు.


Updated Date - 2021-03-07T05:28:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising