ప్రతి గ్రామంలో టీఆర్‌ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించాలి
ABN, First Publish Date - 2021-09-02T04:08:06+05:30
టీఆర్‌ఎస్ పార్టీ జెండా పండుగను పురష్కరించుకొని మండలంలోని ప్రతిగ్రామంలో టీఆర్‌ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరిం చాలని ఎమ్మెల్యే తనయుడు ఆత్రం వినోద్, టీఆర్‌ఎస్ పార్టీ మండల ఆధ్యక్షుడు గాదవేణి మల్లేష్ అన్నారు.
ఆసిఫాబాద్‌రూరల్, సెప్టెంబరు 1: టీఆర్‌ఎస్ పార్టీ జెండా పండుగను పురష్కరించుకొని మండలంలోని ప్రతిగ్రామంలో టీఆర్‌ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరిం చాలని ఎమ్మెల్యే తనయుడు ఆత్రం వినోద్, టీఆర్‌ఎస్ పార్టీ మండల ఆధ్యక్షుడు గాదవేణి మల్లేష్ అన్నారు. బుధవారం వారు విలేఖరులతో మాట్లాడుతూ జెండా పండుగను ప్రతికార్యకర్త విజయవంతం చేయాల న్నారు. ఈమేరకు మండలంలోని ఆయాగ్రామ కమిటీ సభ్యులకు పార్టీ జెండాలు, కండువాలు అందజేశారు.
సిర్పూర్(యూ):టీఆర్‌ఎస్‌పార్టీ ఆవిర్భావ దినోత్స వాన్ని ఘనంగా నిర్వహించాలని జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్రంభగవంత్‌రావ్, మండల అధ్య క్షుడు తోడసం ధర్మరావ్ పార్టీ శ్రేణులను కోరారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ ఆత్రంప్రకాష్, సర్పంచులు మెస్రం భూపతి, ఆర్క హిరాబాయి పాల్గొన్నారు.
Updated Date - 2021-09-02T04:08:06+05:30 IST