ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యాధికారం కోసం బహుజనులు ఏకంకావాలి

ABN, First Publish Date - 2021-07-31T04:03:29+05:30

రాజ్యాధికారం కోసం బహుజనులు ఏకం కావాలని, బడుగు, బలహీన వర్గాలు ఏకతాటిపైకి తీసుకురావడానికి తన ఆరేళ్ల సర్వీ సును వదులుకొని మీ ముందుకు వచ్చానని రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం ఆర్యవైశ్యభవన్‌లో స్వేరోస్‌ ఆధ్వర్యంలో ప్రవీణ్‌కుమార్‌కు అభినందన సభ నిర్వహించారు.

మాట్లాడుతున్న రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ 

జన్నారం, జూలై 30: రాజ్యాధికారం కోసం బహుజనులు ఏకం కావాలని, బడుగు, బలహీన వర్గాలు ఏకతాటిపైకి తీసుకురావడానికి తన ఆరేళ్ల సర్వీ సును వదులుకొని మీ ముందుకు వచ్చానని రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం ఆర్యవైశ్యభవన్‌లో స్వేరోస్‌ ఆధ్వర్యంలో  ప్రవీణ్‌కుమార్‌కు అభినందన సభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తర తరాలుగా బహుజనులకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతోందని, బడుగు బలహీనవర్గాలకు న్యాయం జరగడానికి ఎలాంటి త్యాగానికైనా సిద్ధమన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో వెయ్యి కోట్లు ఖర్చు చేసేందుకు సర్కారు సిద్ధ మైందని, ఈ డబ్బులు విద్య కోసం ఖర్చు చేస్తే ఎందరో విద్యార్థుల జీవితాలు బాగుపడేవన్నారు. గూడ అంజయ్య రాసిన ఊరు మనదిరా.. వాడ మనదిరా... దొర ఎందిరో.. దొరతనమేందిరో అనే పాటను ప్రసంగానికి ముందు పాడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ తల్లి, అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేశారు. కార్యక్రమంలో బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్‌, నాయకులు మిలిన్‌, దేవోజీ, గంగాధర్‌, బోస్‌, స్వేరోస్‌ ఇంటర్నేషనల్‌ అధ్యక్షుడు కిరణ్‌, బన్సీలాల్‌, ఊషన్న పాల్గొన్నారు.  

Updated Date - 2021-07-31T04:03:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising