ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రణాళికా బద్ధంగా విచారణ పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2021-07-30T06:02:58+05:30

ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కేసుల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా విచారణ పూర్తిచేయాలని, పెండింగ్‌ కేసుల విషయంలో పురో గతి సాధించాలని ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెండింగ్‌ కేసుల్లో పురోగతి సాధించాలి ఫఎస్పీ సీహెచ్‌. ప్రవీణ్‌కుమార్‌

నిర్మల్‌ కల్చర ల్‌, జూలై 29 : ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కేసుల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా విచారణ పూర్తిచేయాలని, పెండింగ్‌ కేసుల విషయంలో పురో గతి సాధించాలని ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో అధికారులతో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహిళలకు సంబంధించిన కేసుల్లో త్వరి తగతిన విచారణ పూర్తి చేయాలన్నారు. శిక్షణ పడేలా పరిశోధనలుండాలని అన్నా రు. అండర్‌ ఇన్వెస్టిగేషన్‌ కేసులను విధించిన టార్గెట్‌ ప్రకారం తగ్గించాలని అన్నారు. క్రమపద్ధతిలో ప్రతీ కేసు ఇన్వెస్టిగేట్‌ చేయాలని లాంగ్‌ పెండింగ్‌ కేసు లను పకడ్బందీగా ఇన్వెస్టిగేట్‌ చేసి డిస్పోజ్‌ చేయాలని తెలిపారు. ఎఫెసెల్‌ రిపోర్ట్‌పై ప్రతి రోజు మానిటర్‌ చేయాలన్నారు. క్రైం అగైనెస్ట్‌ ఉమెన్‌ కేసుల్లో అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేట్‌ చేసి నిందితులను అరెస్ట్‌ చేసి కోర్టులో శిక్షపడేలా ఇన్వెస్టిగేషన్‌ ఉండాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, పోక్సో, క్రైం, అగైనెస్ట్‌ ఉమెన్‌ కేసుల్లో ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో ప్రత్యేక చార్ట్‌ తయారు చేసి రోజువారీ మానిటర్‌ చేయాలన్నారు. ఫంక్షనల్‌, వర్టికల్‌ వారీగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రతిఏటా కేంద్రం దేశం మొత్తంలో ఎంపిక చేసే 10 పోలీస్‌స్టేషన్ల జాబితాలో నిర్మల్‌ జిల్లా నుండి ఎంపికయ్యే విధంగా కేసుల పరిశోధన జరుపాలన్నారు. పోలీస్‌స్టేషన్లకు వచ్చే దరఖాస్తులపై డివిజన్‌ అధికారులు తరచూ ఫిర్యాదు దారులతో మా ట్లాడాలని అన్నారు. బ్లూకోల్డ్స్‌, పెట్రోకార్స్‌ అధికారులు సిబ్బంది 100 నెంబర్‌కు కాల్‌ రాగానే 10 నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకోవాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజల్లో చైతన్య పర్చాలని మహిళా పోలీస్‌ సిబ్బందికి సేష్టన్లలో రెస్ట్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. కరోనా సందర్భంగా ప్రజల కోసం 24 గంటల పాటు నిర్విరామంగా పని చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. అదనపు ఎస్పీ రాంరెడ్డి, భైంసా ఏఎస్పీ కిరణ్‌కారే, డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-30T06:02:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising