ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాలకుల ఆచరణ సాధ్యం కాని హామీలు

ABN, First Publish Date - 2021-10-25T04:08:41+05:30

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఆచారణ సాధ్యం కాని హామీలు ఇస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా పాలన సాగిస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.

మంచిర్యాలలో మాట్లాడుతున్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ
మంచిర్యాల కలెక్టరేట్‌, అక్టోబరు 24: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఆచారణ సాధ్యం కాని హామీలు ఇస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా పాలన సాగిస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.  ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేణ శంకర్‌లతో కలిసి మాట్లాడారు.  ప్రధాని మోదీ పాలను చూస్తుంటే కాబూలీవాలా పాఠం గుర్తుకొస్తోందని చెప్పారు. దేశాన్ని కార్పొరేట్‌ శక్తులకు దారాదత్తం చేసి రోజుకు 1000 కోట్ల  అక్రమ ఆదాయాలను కూడగట్టేందుకు ప్రధాని యత్నిస్తున్నారని విమర్శించారు.  ఏడాదికి కోటి ఉద్యోగాలని, నల్లధనం తెచ్చి ప్రజలకు అకౌంట్‌లలో15 లక్షలు వేస్తామని  మాయ మాటలు చెప్పిఅధికారంలోకి వచ్చాక విస్మరించారన్నారు. విభజన రాజకీయాలకు తెరలేపారని చెప్పారు. మరో వైపు రాష్ట్రంలో కేసీఆర్‌ పాలనకూడా అవినీతిలతో కూరుకుపోయి ప్రజలు నమ్మలేని స్థితికి  చేరిందన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ పాలన గాలికొదిలేసి హుజురాబాద్‌ ఎన్నికలో గెలిచే సత్తాలేక  సర్వశక్తులొడ్డుతోందన్నారు. దళితబంధుపేరుతో మరోమారు మోసపూరిత వాగ్దానం చేసి అభాసుపాలయ్యారన్నారు. టీఆరెఎస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితిలేదన్నారు.  సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుండామల్లేష్‌ సేవలు మారువలేనివని చెప్పారు.  విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో తనతో కలిసి పనిచే శానన్నారు.  ఆయన ఆశయ సాధనకోసం ప్రజాస్వామ్య శక్తులు ఏకం కావాలని నారాణయ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ మాజీ ఎఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి సీతారా మయ్య, పట్టణ కార్యదర్శి ఖలిందర్‌ ఖాన్‌, రామడుగు లక్ష్మణ్‌, మేకలదాసు, ఎనగందుల నర్సయ్య,  యాదగిరి, జోగుల మల్లయ్య, మిట్టపెల్లి పౌలు, దేవిపోచం పాల్గొన్నారు.

Updated Date - 2021-10-25T04:08:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising