ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాను గంజాయి రహితంగా మార్చాలి

ABN, First Publish Date - 2021-10-23T06:28:04+05:30

గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు పోలీస్‌ అధికారు లు కృషి చేయాలని ఎస్పీ ప్రవీ ణ్‌కుమార్‌ ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌ కల్చరల్‌, అక్టోబరు 22 : గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు పోలీస్‌ అధికారు లు కృషి చేయాలని ఎస్పీ ప్రవీ ణ్‌కుమార్‌ ఆదేశించారు. శుక్ర వారం జిల్లా పోలీస్‌ కార్యాల యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... జిల్లాలో గంజాయి, గుడుంబా, గుట్కా తదితర మాదకద్రవ్యాల బారిన పడకుండా ప్రజలను కాపాడాలంటే వాటిని సరఫరా చేసేవారిపై ఉక్కుపాదం మోపాలని పిలుపు నిచ్చారు. ముఖ్యంగా యువత ఎలాంటి వ్యసనాలకు బలికాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. అనేక మంది యువత వీటికి బానిసై శారీరకంగా, మాన సికంగా జీవితాలు కోల్పోతున్నారని ఆందోళనవ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే అధికారులు తగిన నెట్వర్క్‌ ఏర్పాటు చేసుకోవాలన్నారు. యువత, ఇతర వృత్తుల వారిపై నిఘా ఉంచాలన్నారు. గంజాయి సాగుచేసే వారిపై, అవి లభించిన వారిపై పీడీ చట్టం విధించి క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలన్నారు. మాదకద్రవ్యాలు అరి కట్టడంలో ప్రజలు సైతం బాధ్యతగా వ్యవహరించాలన్నారు. వీటి సరఫరా ఉత్పత్తుల సమాచారాన్ని పోలీస్‌శాఖకు తెలియజేయాలని కోరారు. మహిళలు, చిన్నపిల్లలపై జరిగే నేరాలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. అందుకు బాధ్యులైన వారిని ఉపేక్షించరాద న్నారు. గంజాయి అరికట్టడంలో చాకచక్యం ప్రదర్శించిన అధికారులకు ప్రత్యేక రివా ర్డులు అందజేయనున్నట్లు తెలిపారు. పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గంజాయి రహితంగా మా ర్చేందుకు నేటి నుండి కంకణ బద్ధులమై ఉంటామని ప్రమాణం చేయించారు. దర్యాప్తు లో ఉన్న కేసులను త్వరగా చేధించాలన్నారు. అదనపు ఎస్పీ రామ్‌రెడ్డి, భైంసా ఏఎస్పీ కిరణ్‌ క ఆరే, డీఎస్పీ ఉపేందర్‌ రెడ్డి, జీవన్‌ రెడ్డి, ప్రొబిషన్‌ ఎక్సైజ్‌ అధికారులు, సీఐలు శ్రీనివాస్‌, వెంకటేష్‌, ప్రవీణ్‌కుమార్‌, చంద్రశేఖర్‌, రామ్‌నర్సింహారెడ్డి, వినోద్‌, ఎస్బీ ఇన్స్‌పెక్టర్‌ రమేష్‌, జిల్లాలోని ఎస్సైలు హాజరయ్యారు. 

Updated Date - 2021-10-23T06:28:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising