ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పసికందు పొదలపాలైంది!

ABN, First Publish Date - 2021-04-19T05:35:20+05:30

ఆడపిల్లగా పుట్టడమే ఆ శిశువు చేసుకున్న పాపమేమో.. అల్లా రు ముద్దుగా కంటికి పాపల పెంచుకోవాల్సిన వారు పుట్టిన వెంటనే క్రూరంగా పం ట చేను చేట్ల పొదల్లో విసిరేసి మానవత్వం మంట గలిపిప ఘటన మండలంలోని పల్సి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలో

పసికందును అంబులెన్సులో ఆదిలాబాద్‌కు తరలిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పుట్టిన వెంటనే ముళ్లపొదల్లో పారవేసిన వైనం

కుభీర్‌, ఏప్రిల్‌ 18: ఆడపిల్లగా పుట్టడమే ఆ శిశువు చేసుకున్న పాపమేమో.. అల్లా రు ముద్దుగా కంటికి పాపల పెంచుకోవాల్సిన వారు పుట్టిన వెంటనే క్రూరంగా పం ట చేను చేట్ల పొదల్లో విసిరేసి మానవత్వం మంట గలిపిప ఘటన మండలంలోని పల్సి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని పల్సి గ్రామ శివారులో ఉదయం వ్యవసాయ పనులకు వెళ్తున్న జయక్క అనే మహిళ రైతుకు చెట్ల పొదల్లో నుంచి పసికందు ఏడుపులు వినిపించాయి. వెంటనే ఆ మహిళ చు ట్టుపక్కల వెతకగా చెట్ల పొదల్లో ఉన్న ఓ సంచి మూటలో శిశువు ఏడుపులు వస్తు న్నట్లు గమనించి గ్రామస్తులకు తెలిపింది. వెంటనే గ్రామస్తులు అక్కడికి చేరుకొని ఆ మూటను విప్పి చూశారు. అందులో అప్పుడే పుట్టిన ఆడ శిశువు ఉంది. తల్లి గర్భం నుంచి రక్తపుమడుగుల్లో ఉన్న ఆ శిశువును శుభ్రం చేసి ఐసీడీఎస్‌ సిబ్బంది కి, పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. విషయం తెలుసుకున్న అంగన్‌వాడీ కార్యకర్త, ఆరోగ్య సిబ్బంది ఆ శిశువును భైంసా ఏరియాసుపత్రికి తరలించి వైద్యం చేపించారు. అనంతరం ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ భారతి ఆ శిశువును శిశుసంరక్షణ కేంద్రం ఆదిలాబాద్‌ వారికి అప్పగించారు. గ్రామంలో ఆ శిశువు పుట్టిన వెంటనే ఎవరు పారేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

Updated Date - 2021-04-19T05:35:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising