ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై చర్య తీసుకోండి

ABN, First Publish Date - 2021-05-12T06:46:04+05:30

ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులకు పంటను పండించడం ఒక ఎత్తయితే పండించిన పంటను విక్రయమించడం మరో సవాలుగా మారింది.

తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేస్తున్న ఎంపీపీ, సర్పంచ్‌, రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసిన రైతులు

కుంటాల, మే 11 : ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులకు పంటను పండించడం ఒక ఎత్తయితే పండించిన పంటను విక్రయమించడం మరో సవాలుగా మారింది. ఇందుకు నిదర్శనం ప్రభుత్వం మండలంలోని ఆయా గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. రైతుల ఆ కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలంటే నానా తంటాలు పడాల్సి వస్తుంది. ఒక్కొ రైతుకు సంబంధించిన ధాన్యం నుంచి తేమశాతం ఎక్కువ ఉందంటూ. తప్ప, తాలు పేరుతో క్వింటాలుకు 10కిలోలు కోత విధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం కుంటాల మండలంలోని అంబకంటి గ్రామంలో సహ కార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేపడతుండగా రైతులు కోత విధించడంపై నిరసిస్తూ స్థానిక తహసీల్దార్‌ శ్రీధర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి ఎంపీపీ అప్క గజ్జారాం యాదవ్‌, అంబకంటి సర్పంచ్‌ ముజ్గి ప్రదీప్‌లు  మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన ధాన్యంపై కోతలు విధించడం సరికాదాన్నారు. దళారుల బెడద నుంచి తప్పించాలని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, ఈ కేంద్రాల్లో దళారులకు భిన్నంగా కొనుగోలు కేంద్రాలు తయారై రైతులను నట్టేట ముంచుతున్నారని అన్నారు. ఇకనైనా కోతలు విధించకుండా రైతుల ధాన్యాన్ని వేగవంతంగా కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2021-05-12T06:46:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising