జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
ABN, First Publish Date - 2021-06-27T04:40:36+05:30
మండల కేంద్రంలో శనివారం మార్క్‌ఫెడ్ ద్వారా పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ మోతీరాం, జడ్పీటీసీ ధ్రుపతాబాయి ప్రారంభించారు.
కెరమెరి, జూన్ 26: మండల కేంద్రంలో శనివారం మార్క్‌ఫెడ్ ద్వారా పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ మోతీరాం, జడ్పీటీసీ ధ్రుపతాబాయి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ మండలం లోని రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాల న్నారు. ప్రభుత్వం క్వింటాలు జొన్నలకు రూ.2620 మద్దతు ధర ప్రకటించిందన్నారు. వైస్‌ఎంపీపీ అబ్దుల్‌కలాం, ఏవో గోపికాంత్, పీఏసీఎస్ చైర్మన్ శంకర్, ఏఈఓలు వెంకటేష్, రవీందర్, సీఈవో విజయ్‌కుమార్, మార్క్‌ఫెడ్ ఎగ్జిక్యూటివ్ అధికారి నరేష్, సర్పంచ్‌లు ఉత్తంనాయక్, జగన్నాథ్ పాల్గొ న్నారు.
జైనూరులో కొనుగోళ్లు నిలిపివేత..
జైనూరు: స్థానిక మార్కెట్ కమిటీ గోదాంలో కొద్ది రోజుల నుంచి కొన సాగుతున్న జొన్న కొనుగోళ్లను వచ్చే సోమ, మంగళ వారాల్లో నిలిపివే స్తున్నట్లు మార్కెట్ కార్యదర్శి సయ్యద్ ఆజంఅలీ పేర్కొ న్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ మా ర్కెట్ సిబ్బంది రెండురోజుల పాటు మారుమూల గ్రామాలను సందర్శిస్తూ రైతుల ఇంట్లో నిలువ ఉన్న జొన్న పంటను పరిశీలిస్తారని అన్నారు. బుధవారం నుంచి తిరిగి కొనుగోళ్లు ప్రారంభిస్తామని ఆయన అన్నారు.
Updated Date - 2021-06-27T04:40:36+05:30 IST