ఆదివాసీల ప్రత్యేక పూజలు
ABN, First Publish Date - 2021-10-30T04:02:49+05:30
మండలంలోని పెద్దసాకడ గ్రామంలో శుక్రవారం బోగి పండుగను పురస్కరించుకుని శుక్రవారం ఆదివాసీ లు ప్రత్యేక పూజలు నిర్వహించారు
కెరమెరి, అక్టోబరు 29: మండలంలోని పెద్దసాకడ గ్రామంలో శుక్రవారం బోగి పండుగను పురస్కరించుకుని శుక్రవారం ఆదివాసీ లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ పటేల్ సోంజీ, దండారి జమానికి బిలాజీరావు, గ్రామస్థులు రాము, జంగు, శంకర్, దుందేరావు, భగవంతరావు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
జైనూరు: దండారి సంబరాలను పురస్కరించుకుని అదివాసులు శుక్రవారం ఏత్మసూర్ దండారి దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా గుస్సాడి టోపి, డప్పులు, వాయిద్యాలకు నైవిధ్యం సమర్పించి పూజలు చేశారు. మండలంలోని పవర్‌గూడ, జామ్ని తదితర గ్రామాల్లో దండారి సంబరాలు మొదల య్యాయి. ఈ సందర్భంగా పవర్ గ్రామ పటేల్ అనక మారుతి, గ్రామస్థులు చిన్న, అనక రాంజీ, గేడాం మారు, ఉయిక శ్రీనివాస్, ఆత్రం బళిరాం, ఉయిక జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-30T04:02:49+05:30 IST