ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రౌండ్ రౌండుకు పెరుగుతున్న ఈటెల ఆధిక్యం.. టీఆర్ఎస్‌లో గుబులు పుట్టిస్తున్న Huzurabad ఫలితాలు..!

ABN, First Publish Date - 2021-11-02T17:51:39+05:30

తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల లెక్కింపు మంగళవారం జరుగుతోంది. టీఆర్ఎస్ నుంచి ఈటెల రాజేందర్ తన మంత్రి పదవికి రాజీనామా చేసి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల లెక్కింపు మంగళవారం జరుగుతోంది. టీఆర్ఎస్ నుంచి ఈటెల రాజేందర్ తన మంత్రి పదవికి రాజీనామా చేసి మరీ బీజేపీలోకి వెళ్లిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈటెలను ఓడించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వశక్తులను ఒడ్డారు. దళితబంధు పథకంతోపాటు అప్పటికప్పుడు హుజూరాబాద్‌లో అభివృద్ధి పనుల వరకు అన్ని అంశాలను ఉపయోగించుకున్నారు. మంత్రి హరీశ్ రావుతో సహా పలువురు మంత్రులు హుజూరాబాద్‌లోనే మకాం వేశారు. అయినప్పటికీ హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ తప్పేట్టు కనిపించడం లేదు. 


ఇప్పటి వరకు విడుదలయిన ఐదు రౌండ్ల ఫలితాల్లో ప్రతీ రౌండ్లోనూ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందరే ముందంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల వరకు టీఆర్ఎస్ ఆధిక్యం కనపర్చినప్పటికీ ఈవీఎం ఓట్ల లెక్కింపు విషయానికి వచ్చేసరికి ప్రతీ రౌండ్లోనూ టీఆర్ఎస్ వెనుకంజలోనే ఉంది. మొదటి రౌండ్లో 166 ఓట్ల ఆధిక్యాన్ని ఈటెల కనపరిచారు. రెండో రౌండ్లో 193 ఓట్లు.. మూడో రౌండ్లో 1263 ఓట్లు, నాలుగో రౌండ్లో 1825 ఓట్ల ఆధిక్యంలో ఈటెల ఉన్నారు. అయిదో రౌండ్‌లో 344 ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు. దళితబంధు పథకం ప్రారంభించిన గ్రామంలో కూడా ఈటెలకే మెజార్టీ రావడంతో.. హుజూరాబాద్‌లోని మెజార్టీ గ్రామాలు బీజేపీ వైపే మొగ్గుచూపినట్టు స్పష్టంగా కనిపిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించడం గమనార్హం.

Updated Date - 2021-11-02T17:51:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising